ప్రస్తుతం మనిషి జీవిన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మన చిన్న తనంలో గుండె పోటు అంటే ఏ 55 ఏళ్ల వయస్సు వచ్చిన వారో లేదా ఏ 60 ఏళ్లు 70 ఏళ్లు వచ్చిన వారికో వచ్చేది. అంటే పెద్ద వాళ్లకు మాత్రమే గుండె పోటు వచ్చేది .. కాని ఇప్పుడు ప్రతి మనిషి లోనూ చిన్న వయస్సులోనే తీవ్రమైన ఒత్తిళ్లు ఉంటున్నాయి.. అందుకే 30 + వయస్సు దాటిన వారికే గుండె పోటు రావడం .. గుండె సంబంధిత సమస్యలు రావడం జరుగుతోంది. మనం ప్రతి రోజు 30 ఏళ్ల వయస్సు .. 40 ఏళ్ల వయస్సు కే గుండె పోటుతో చనిపోతున్న వారి వార్తలు చూస్తూనే ఉంటున్నాం. ప్రస్తుతం అందరిది ఉరుకు పరుగుల యుగం అయిపోయింది. దీనికి తోడు చిన్న వయస్సులో నే అధిక ధూమపానం .. మద్యపానం చేయడం లాంటి వాటితో పాటు ఆహారపు అలవాట్లు సైతం చిన్న వయస్సులోనే గుండె పోటుకు కారణమవుతున్నాయి.
అయితే ఈ క్రింది ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని వైద్య నిపుణులు చెపుతున్నారు. వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్ ను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. ఆ ఐదు అలవాట్లు ఇవే..
1 ) * శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా లభించే ఆలివ్ ఆయిల్, ఆవనూనె, అవిసెగింజల నూనె
వంటి వాటిని తీసుకోవాలి. వీటి మోతాదు నెలకు అర లీటరు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు
2) నట్స్, ప్రొటీన్ ఫుడ్, పీచుపదార్థం అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం
వీలైనంత తక్కువ తినాలి.
3) ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్మోకింగ్,
4) ఆల్కహాల్ అలవాటు మానేయాలి.
5) నిద్ర మానసిక ఆరోగ్యానికే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.