
నిమ్మకాయ ఆరోగ్యపరంగా మనకు ఎన్నో రకాలుగా దోహదం చేస్తుంది. నిమ్మకాయ లో ఎన్నో రకాల విటమిన్లు అధికంగా ఉంటాయి. నిమ్మకాయ అనేది మనకు కేవలం కూరల్లోనూ . . వంటల్లో మాత్రమే కాదు మానవ శరీరానికి ఆరోగ్య పరంగా కూడా ఎన్నో విధాలుగా దోహదం చేస్తుంది. నిమ్మకాయ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది . . అలాగే నిమ్మకాయ లో ఉండే అనేక గుణాలు ఇన్ఫెక్షన్ల తో పోరాడటానికి సహాయపడతాయి. గాయాలను నయం చేయడానికి సహాయ పడుతుంది. చర్మానికి కొల్లాజెన్‌ను తయారు చేయడం లో సహాయ పడుతుంది. అలాగే నిమ్మకాయ శరీరం ఇనుము ను గ్రహించడం లో సహాయ పడుతుంది. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ బి 6 వంటి విటమిన్లు ఉంటాయి. అలాగే , ఇనుము , పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే నిమ్మకాయల లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే మానవ శరీరంలో ని కొన్ని లక్షణాలు కన్పిస్తే.. మన శరీరానికి నిమ్మకాయ అవసరం అని మనం గమనించాలి. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం.
* మీకు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు నిమ్మకాయ రసం తీసుకోవాలి.
* అలసట , బలహీనంగా మారడం కూడా నిమ్మరసంతో చెక్ పెట్టవచ్చు.
* చర్మం పొడిబారిపోవడం
* తరచూ డీహైడ్రేటెడ్గా మారడం
* నోటి నుంచి దుర్వాసన రావడం
* జాయింట్ పెయిన్స్
* మూడ్ స్వింగ్స్, యాంగ్జెటీ / ఆందోళన
ఈ లక్షణాలు కనిపిస్తే మీరు నిమ్మకాయను ప్రతిరోజు ఆహారంలో,పానీయంలో ఏదో ఒక రకంగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.