- ( లైఫ్ స్టైల్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇప్పుడు అంటే మ‌నం తినే ఆహారాల్లో ర‌క‌ర‌కాల మార్పులు వ‌చ్చేశాయి. ఇప్పుడు ప్ర‌పంచం అంతా ఓ కుగ్రామంలా మారిపోయింది. ప్ర‌తి దేశంలో పాపుల‌ర్ ఫుడ్ ఐటెమ్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు పాకేస్తున్నాయి. మ‌న హైద‌రాబాద్ ఫేమ‌స్ బిర్యానీ ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌కు పాకేసింది. కానీ పూర్వా కాలంలో అన్నం వండి కాచే గంజి కూడా బ‌ల‌మైన ఆహారంగా ఉండేది. గంజి తాగితే అప్ప‌ట్లో ఎంతో బ‌లం అని న‌మ్మేవారు. అందుకే ఆ రోజుల్లో గంజి తాగే వారు ధృడ‌మైన శ‌రీరంతో భారీ కాయులుగా ఉండేవారు. పూర్వం అన్నం వండి .. ఆ గంజిని తాగే వారు మనతాతలు, ముత్తాతలు .. అందులో ఉండే బ‌ల‌మైన పోష‌కాల వ‌ల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు .. గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా .. కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే ... మళ్లీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలుపెడతారు.


గంజిని అన్నంలో వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు,శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుంది. చర్మాన్ని సున్నితంగా,అందంగా మార్చుతుంది. చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి,మలబద్ధకాన్ని వదిలిస్తుంది.నీరసంగా ఉన్నప్పుడు గంజిని తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. గంజితో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.పసి పిల్లలకు, ఎదిగే పిల్లలకు రోజూ గంజిని తాగిస్తే చాలా మంచిది.వారికి సరైన పోషకాలు అందుతాయి. శారీరక ఎదుగుదల కూడా బావుంటుంది. పిల్లలు విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నప్పుడు గంజిని మించిన దివ్యౌషధం లేదు. కనుక ఇంట్లో కుక్కర్ అన్నం వండడానికి బదులు గంజి వార్చేలా అన్నం వండితే చాలా మంచిది.ఆ గంజిని ఇంటిల్లిపాది తాగితే ఆరోగ్యం మీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: