మెకాళ్ళ నొప్పులు పొవడానికి, నరాల శక్తి పెరగడానికి, శరీరంలోని ఇతర నొప్పులు తగ్గి హుసారుగా నడవడానికి చిత్రమూలాది కసాయం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ప్ర‌తి  ఒక్క‌రు వారి ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ముందుగా ఈ కిందివి సేక‌రించుకోవాలి.


చిత్రమూలం వేర్ల పొడి:100గ్రా
అస్వగంధపొడి     : 100గ్రా
శతావరీ  పొడి  :   100 గ్రా
పల్లేరు పొడి   :    100 గ్రా
బూరుగ జిగురు : 100 గ్రా
తుమ్మజిగురువేయించి:100 గ్రా
బాదాం జిగురు  : 100 గ్రా
రావి జిగురు. :  100 గ్రా
శొంటిపొడి    :   100 గ్రా
వాము పొడి  : 100 గ్రా
లోహా భస్మం  : 20 గ్రా
మండూర భస్మం : 20 గ్రా
ఇంగువ పొడి : 10 గ్రా


పై వస్తువులు తీసుకొని భాగా పొడి చేసుకొని అన్నీ కలిపి ఒక సీసాలొ భద్రపరుచుకొని, ఉదయం ఒక  స్పూన్, మధ్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్, భోజనానికి ముందు నీటితో  తీసుకొవాలి లేదా ఆవు మజ్జిగలో లేదా ఆవు పాలల్లొ తీసుకొవచ్చును.  ఇలా చేయడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గి శక్తి పెరిగి, మెకాళ్ళల్లో జిగురు పెరుగుతుంది.


ఎక్కువగా మెకాళ్లల్లో జిగురు అరిగిపొయివుంటె ఈ క్రింది విధంగా కూడా పాటించాలి.
ఈ క్రిందివి కూడా వాడుకోవాలి ఎముకలు బలంగా మార‌తాయి..
1 బీజ్ బంద్ 100 గ్రాములు
2, నీరు గొబ్బిగింజలు 100 గ్రాములు
3, మహా భీర విత్తనాలు 100 గ్రాములు
4, చియా సీడ్స్  100 గ్రాములు


ఈ నాలుగు రకాల గింజలు మీరు సమానంగా తీసుకొచ్చి అనగా ఒక్కోక్కటి 100గ్రాలు చొప్పున తెచ్చి ఇందులో రాళ్ళు, చెత్తవంటివి తీసి అన్నీ కలిపి ఒక సీసాలో వుంచి, మధ్యాహం బోజనానికి ముందు సాయంత్రం ఈ రెండు సమయాల్లో ఈ గింజలు అన్నీ కలిపినవి సుమారు ఒకటిన్నర స్పూన్ అర్దగ్లాస్ నీటిలో వెసి 10 నిముసాలు నానిస్తే ఇవి అన్నీకూడా మెత్తగా అవిపొవును, వీటిని నీటితో సహా మీరు త్రాగాలి, ఇలా చేయడం వల్ల మీ ఎముకలు బలంగా మారుతాయి, మీ మెకాళ్ళల్లో, జాయింట్లల్లో, జిగురు అరిగిపొయినా మళ్ళీ జిగురు పెరుగుతుంది, ఎమకలు ధ్రుడంగా మారుతాయి, శక్తి పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి, కండపుస్టి కలుగుతుంది. ఇలా మీరు మీ సమస్య పొయెంతవరకూ మీరు ఈ విధంగా చేసుకొని వాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: