నిత్యం మనం ఇంటి పనులు, ఆఫీసు పనులతో ఎంతో అలసి పోతుంటాం. ముఖ్యంగా ఇంటిపనులతో బిజీగా గడిపే మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలుంటాయని, వీటిని అధిగమించాలంటే ప్రతిరోజు గంటపాటు యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బాబా రామ్ దేవ్ తెలిపారు. ఆయన నిర్వహించే యోగా శిభిరాల్లో పెద్దఎత్తున మహిళలు, వృద్దులు, విద్యార్థులు వస్తుంటారు.
రాందేవ్ బాబా చెప్పిన ఆసనాలను నేర్చుకున్నారు. మనం నిత్యం ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటాం.. అయితే ఆ సమస్యల నుంచి మనల్ని బయట పడేసే ఏకైక సాధనం యోగ.
యోగాసనాలు నియమానుసారంగా ఆచరిస్తే జీవితంలో ఎటువంటి రోగాలు దరి చేరవన్నారు. యోగా అనేది ఖర్చుతో కూడుకున్నది కాదని..మన మనసు ఏకాగ్రతగా చేస్తే యోగా ఆసనాలు ఎంతో సులభంగా ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుందని బాబా రాందేవ్ అన్నారు.