జనవరి 23వ తేదీన చరిత్రలో ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి ఇంతకీ జనవరి 23వ తేదీన చరిత్రలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి.
చైనా భూకంపం : 1556 జనవరి 23వ తేదీన చైనాలోని షాంగ్టీ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపంలో ఏకంగా ఎనిమిది లక్షలమందికి పైగా మరణించారు.
సుభాష్ చంద్రబోస్ జననం : భారతదేశం వీరులకు నిలయం ఎంతో మంది వీరులు భరత మాత ఒడిలో ప్రాణాలు వదిలారు. భరతమాత కు స్వేచ్ఛాయువులు అందించడానికి ప్రాణాలను సైతం అర్పించారు. సర్వస్వాన్ని వదిలి పెట్టి కేవలం భరతమాత సంకెళ్ళు తెంపడానికి జీవితాలను ధారపోసిన వారు ఎంతోమంది. అలాంటి స్వతంత్ర సమరయోధులలో ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్ర బోస్ జీవితం ఆద్యంతం సాహసంగా సాగిపోతూ ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23వ తేదీన జన్మించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అసలు సిసలైన భారత పౌరుషానికి మారుపేరు. ఓవైపు గాంధీజీ శాంతియుతంగా అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని అంటూ పోరాటం చేస్తుంటే అదే సమయంలో సాయుధ పోరాటం తోనే స్వాతంత్రం సిద్ధిస్తుందని.. సాయుధ పోరాటం తోనే ఆంగ్లేయుల ను తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్.
1943 సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాకతో భారత సైన్యం కొత్త ఊపిరి పీల్చుకున్నారు.మీరు రక్తం చిందించండి మీకు స్వాతంత్రాన్ని తెస్తాను అనే నినాదంతో సుభాష్ చంద్రబోస్ దేశభక్తుల్లో ఉత్తేజాన్ని నింపి... స్వతంత్ర సంగ్రామం కోసం పోరాటం ముందుకు వచ్చేలా చేసి ఆంగ్లేయులను భారత దేశం నుంచి తరిమి కొట్టారు..
ఆర్థర్ లూయీస్ జననం : 1915 జనవరి 23వ తేదీన జన్మించారు ఆర్థర్ లూయిస్ .ఈయన ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత.
బాల్ ఠాక్రే జననం : హిందుత్వాన్ని పెంపొందించేందుకు శివసేన పార్టీని స్థాపించిన గొప్ప వ్యక్తి బాల్ థాకరే. బాల్ థాక్రే 1921 జనవరి 23వ తేదీన జన్మించారు. శివసేన పార్టీని భారతదేశంలో 1966 జూన్ 19 లో బాల్ థాక్రే స్థాపించారు. హిందూ సాంప్రదాయ వాద సిద్ధాంతం తో స్థాపించబడిన పార్టీ శివసేన. ప్రస్తుతం బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీకి అధిపతిగా బాల్ థాకరే కుమారుడు ఉద్దవ్ థాక్రే కొనసాగుతున్నారు. బాల్ థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ నాయకులలో మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మహారాష్ట్రలో ఎన్నో పరిణామాల మధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్ థాక్రే . శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే 2012 సంవత్సరంలో పరమపదించారు.
జానంపల్లి కుముదిని దేవి జననం : వనపర్తి సంస్థాన రాణి రాజకీయ నాయకురాలు అయిన జానంపల్లి కుముదుని దేవి 1911 జనవరి 23వ తేదీన జన్మించారు. హైదరాబాద్ తొలి మేయర్ గా కూడా ఈమె పదవీ బాధ్యతలు చేపట్టారు. 2009 సంవత్సరంలో ఈమె పరమపదించారు.
ఎమ్మెస్ నారాయణ మరణం : తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటునిగా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న గొప్ప హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ. దాదాపు హాస్యనటుడిగా 700 చిత్రాలలో నటించారు. పలు సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు ఎమ్మెస్ నారాయణ. ఆయన కామెడీ టైమింగ్ తో నాటి తరం ప్రేక్షకుల నుండి నేటి తరం ప్రేక్షకుల వరకు అందరికి నవ్వుల నవ్వించాడు ఎమ్మెస్ నారాయణ. 1951 లో జన్మించిన ఎమ్మెస్ నారాయణ 2015 జనవరి 23 వ తేదీన పరమపదించారు.