జనవరి 29వ తేదీన చరిత్రలో ఎన్నో సంఘటనలు.. చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖుల మరణాలు... ఇంకెంతో మంది జననాలు జరిగాయి. మరి నేడు హిస్టరీ లోకి వెళ్లి చూస్తే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి.
రామకృష్ణ మఠం ప్రారంభం : 1939 జనవరి 29వ తేదీన రామకృష్ణ మఠం ప్రారంభించబడింది. రామకృష్ణ మఠం అంటే 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ కు చెందిన ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణ పరమహంస పురుషుల కోసం సన్యాసాశ్రమం ఇది . రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చెందేలా రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.
అతి చిన్న లాప్టాప్ : యాపిల్ సంస్థ తయారు చేసిన అతి చిన్న లాప్టాప్ కంప్యూటర్ 2008 జనవరి 29వ తేదీన విడుదల చేయబడింది. ఆపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ అతి చిన్న లాప్టాప్ ను విడుదల చేసారు.
మొసలికంటి తిరుమలరావు జననం : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పార్లమెంటు సభ్యులైన మొసలికంటి తిరుమలరావు 1901 జనవరి 29వ తేదీన జన్మించారు.1921 సంవత్సరంలో మహాత్మా గాంధీ పిలుపుమేరకు చదువును సైతం వదిలి సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు మొసలికంటి తిరుమలరావు. ఆ తర్వాత 1930లో జరిగిన సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని ఏకంగా ఏడాది పాటు కఠిన శిక్ష అనుభవించారు.క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ముసలి కంటి తిరుమలరావు. ఇక తర్వాత రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ సభ్యుడు గాని అసెంబ్లీ సభ్యుడు గాను ఈయన వ్యవహరించాడు. 1975 సంవత్సరంలో ఈయన మరణించారు.
గౌరీ లంకేష్ జననం : ప్రముఖ జర్నలిస్టు ఉద్యమకారిణి గౌరీ లంకేష్ 1962 జనవరి 29వ తేదీన జన్మించారు. చిన్నప్పటినుంచి జర్నలిజంపై ఎంతో ఆసక్తి కనబరిచిన గౌరీ లంకేశ్ ధైర్యశాలి గా ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఎంతగానో పోరాటం చేశారు ఈమె. కాగా గౌరీ లంకేశ్ కొన్ని వివాదాల కారణంగా హత్యలు గురయ్యారు.
వేటూరి సుందరరామ్మూర్తి జననం : తెలుగు ప్రేక్షకులందరూ వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి 1936 జనవరి 29వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో ప్రసిద్ధి చెందిన సినీ గీత రచయిత, తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి... ఆ తర్వాత సినిమాల్లోకి రచయితగా రంగ ప్రవేశం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో రచనలు కూడా రచించారు. వేటూరి సుందరరామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. మొత్తంగా ఈయనా 14 అవార్డులను సొంతం చేసుకున్నారు. శ్రీశ్రీ లాంటి వారి తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించిన వ్యక్తి వేటూరి సుందరరామమూర్తి. ఎన్నో సినిమాలు అద్భుతమైన పాటలను అందించిన గొప్ప రచయిత వేటూరి సుందరరామ్మూర్తి. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
పంగులూరి రామన్ సుబ్బారావు జనం : ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెటర్ పంగులూరి రామన్ సుబ్బారావు 1932 జనవరి 29వ తేదీన జన్మించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి ఇంగ్లాండ్ లో స్థిరపడిన తర్వాత 1987 నుంచి 1990 వరకు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డుకు అధ్యక్షునిగా కూడా కొనసాగారు.
రామ్ నివాస్ మిర్జ మరణం : భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి అయిన రామ్ నివాస్ మిర్జా 2010 జనవరి 29వ తేదీన మరణించారు.