జనవరి 30వ తేదీన చరిత్రలో ఎన్నో సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి.  మరి ఈరోజు ఒకసారి చరిత్ర లోకి వెళ్లి అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 అమరవీరుల దినం: భారత దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పదకొండు గంటలకి సైరన్ మోగిన తర్వాత భారత దేశ ప్రజలందరూ స్వతంత్ర సంగ్రామంలో అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తారు . 

 

 సి. సుబ్రహ్మణ్య జననం : ప్రముఖ రాజకీయ నాయకుడిగా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం జనవరి 30 1990 వ తేదీన జన్మించారు. భారత దేశంలో ఆహార ధాన్యాలు స్వయం సమృద్ది సాధించడం లో చిదంబరం సుబ్రహ్మణ్యం ఎంతగానో దోహదపడ్డారు. కాగా  కేంద్ర ప్రభుత్వంలో ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారత ప్రభుత్వం 1998 సంవత్సరంలో చిదంబరం సుబ్రహ్మణ్యం కు భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఈయన  నవంబర్ 7, 2000 సంవత్సరంలో పరమపదించారు.వ్యవసాయ శాఖ మంత్రి గానే కాకుండా.. పలు  పదవుల్లో బాధ్యతలు చేపట్టారు. 

 

 బెండపూడి వెంకట సత్యనారాయణ జననం : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ చర్మ వైద్యుడు అయిన బెండపూడి వెంకట సత్యనారాయణ 1927 జనవరి 30వ తేదీన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు లో జన్మించిన బెండపూడి వెంకట సత్యనారాయణ... చర్మ వ్యాధులకు నవీన పోకడలను తెలుసుకున్నారు బెండపూడి వెంకట సత్యనారాయణ. భారతదేశంలో డెర్మటాలజీ  అర్హత పొందిన మొదటి వ్యక్తిగా బెండపూడి వెంకట సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డెర్మటాలజీ  పొందిన మొట్టమొదటి వ్యక్తి బెండపూడి వెంకట సత్యనారాయనే. 

 

 డిమిటర్ బెర్బటోవ్ జననం : బల్గెరియాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు డిమీటర్ బెర్బటోవ్ ... 1981 జనవరి 30 వ  తేదీన జన్మించారు.  ఫుట్బాల్ ఆటలో తనపై ఈయన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఫుట్బాల్ ఆటలో తన సత్తా చాటుతూ ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించు కున్నారు డేమిటర్ బెర్బటోవ్. 

 

 మహాత్మా గాంధీ మరణం : స్వతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించే ఆయుధంతో కాదు శాంతి తోనే స్వతంత్రం సిద్ధిస్తుంది అని ముందుకు సాగిన స్వతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ. భారత ప్రజల జాతిపితగా పిలుచుకునే  మహాత్మా గాంధీ ఎన్నో  ఉద్యమాలతో  బ్రిటిష్ వారిపై శాంతియుత పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేలా చేశారు. మహాత్మాగాంధీ 1948 జనవరి 30వ తేదీన మరణించారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్య చేయబడ్డారు.

 

 నాయని కృష్ణకుమారి మరణం : ప్రముఖ తెలుగు రచయిత అయిన నాయని కృష్ణకుమారి ఎన్నో  రచనలతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ప్రముఖ కవి నాయని సుబ్బారావు కుమార్తె ఈ  నాయని కృష్ణకుమారి. 2016 జనవరి 30వ తేదీన ఈమె  మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: