ఫిబ్రవరి 21వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే... ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు.. ఇంకా ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి చూసి నేడు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 రైలు : స్ట్రీమ్  ఇంజన్తో నడిచే రైలు 1804 ఫిబ్రవరి 21వ తేదీన వేల్స్ లో మొదటిసారి ప్రయాణించింది. 


 హైదరాబాద్ పేలుళ్లు : హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21వ తేదీన సాయంత్రం 7 గంటల వరకు వరుస పేలుళ్లు జరిగాయి. కాగా ఈ వరుస పేలుళ్లలో 12 మందికి పైగా మృతి చెందారు. 

 

 శాంతి స్వరూప్ భట్నాగర్ జననం  : ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త అయిన శాంతి స్వరూప్ భట్నాగర్ 1894 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించారు.ఈయనను  భారత పరిశోధనశాల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటిష్ ఇండియాలోని షాపూర్ లో జన్మించిన శాంతి స్వరూప్ భట్నాగర్... ఎన్నో పరిశోధనల్లో  విజయం సాధించారు.  శాంతి స్వరూప్ భట్నాగర్ పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలు పై జరిగేవి. ఈయన భారతదేశంలో 12 పరిశోధన శాలలు స్థాపించారు. ఇక ఆయన జ్ఞాపకార్థం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం కూడా స్థాపించబడింది. 


 ఎం.ఆర్.రాధా జననం: ప్రముఖ తమిళ మరియు రంగస్థల నటుడు అయిన ఎం.ఆర్.రాధా 1907 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించారు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి ఈయన. ఇక ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకి వెళ్ళాడు ఎం.ఆర్.రాధా. 


 వసంతరావు వెంకటరావు జననం : ప్రముఖ సైన్సు రచయిత శాస్త్రవేత్త భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు అయినా వసంతరావు వెంకటరావు 1909 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించారు. అయినా ఎన్నో పరిశోధనలు చేసి విజయం సాధించారు. అంతేకాకుండా భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచారకుడు వసంతరావు వెంకటరావు. భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపన్యాసాలు రచనల ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింప చేశాడు. తెలుగులో భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను రూపొందించాడు. ఈయన ఎన్నో పుస్తకాలు రచించి భౌతిక రసాయనిక  శాస్త్రాలను అందరికీ అవగాహన కల్పించే విధంగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు. 


 సత్య పదానంద ప్రభువు జననం  : హిందూ ఆధ్యాత్మిక గురువు సాయి ధామం వ్యవస్థాపకుడు అయిన సత్య పద నంద ప్రభువు 1939 ఫిబ్రవరి 21వ తేదీన గుంటూరు జిల్లా మానేపల్లి లో జన్మించారు. మూడు దశాబ్దాలుగా స్వచ్ఛంద మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. ఆయన సాధన మరియు ధ్యానం చేయడానికి సాయి ధామం అనే పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు. స్వామీజీ స్థాపించిన ఆశ్రమంలో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్య అనాధ బాలలు వృద్ధులకు అండగా అనాధాశ్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉచిత వైద్య శాలలను కూడా అందించారు ఈయన. 

 


 సుధీర్ నాయక్ జననం  : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయినా సుధీర్ నాయక్ 1945 జనవరి 21వ తేదీన ముంబై లో జన్మించారు. ఇతను భారత క్రికెట్ జట్టు తరఫున 1974లో మూడు టెస్టులు మరియు రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ఇతడు కేవలం క్రికెటర్గానే  కాకుండా కోచ్గా ప్రసిద్ధి గాంచాడు. 

 

 డాక్టర్ దేవరాజు మహారాజు జననం: బహుముఖ ప్రజ్ఞాశాలి హేతువాది జంతు శాస్త్ర నిపుణుడు అయిన డాక్టర్ దేవరాజు మహారాజు 1951 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించారు. తెలుగు రచయిత శాస్త్రవేత్త కవిగా   కూడా ఎంతో ప్రసిద్ధి గాంచారు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సర్వ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు రచనలు కూడా చేసాడు డాక్టర్ దేవరాజు మహారాజు. 

 

 వేదిక జననం :  ప్రముఖ సౌత్ ఇండియన్ హీరోయిన్ అయిన వేదిక సినీ ప్రేక్షకులందరికీ  కొసమెరుపు. తెలుగు తమిళం కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తనదైన నటనతో అలరిస్తు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు వేదిక. ఈమె 1988,  21వ తేదీన జన్మించారు. 

 

 స్థానం నరసింహారావు మరణం : ప్రసిద్ధ రంగస్థల మరియు తెలుగు సినిమా నటుడు సత్యభామ చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకులు అభిమానంతో పద్మశ్రీ పురస్కారం పొందిన వ్యక్తి స్థానం నరసింహారావు 1971 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు.

 

 పితాంబరం మరణం : తెలుగులో ఎన్టీఆర్ తమిళంలో ఎంజీఆర్  లాంటి హీరోలకు వ్యక్తిగత మేకప్మేన్ గా వ్యవహరించాడు పితాంబరం. ఈయన  2011 ఫిబ్రవరి 21వ తేదీన మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: