ఏప్రిల్ 12వ తేదీన ఒక సారి చరిత్రలో ఒక వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెల్లి ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం
ఎస్ పి నరసింహులు నాయుడు జననం : తమిళనాడుకు చెందిన భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడు సమాజ సేవకుడు ప్రచురణ కర్త అయిన ఎస్ పి నరసింహ నాయుడు 1884 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. తమిళంలో యాత్రా సాహిత్యం రాసిన తొలి వ్యక్తిగా పైన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతేకాకుండా తొలి పరిశ్రమలను నెలకొల్పి ప్రజా విద్యా సంస్థల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు.
కోపల్లె హనుమంతరావు జననం : ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపించిన గొప్ప వ్యక్తి... జాతీయ విద్య ఎంతగానో కృషి చేసిన తెలుగు వాడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కోపల్లె హనుమంతరావు 1880 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు, 1910 సంవత్సరంలో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు... ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుగుణంగా ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపన కూడా చేశారు ఈయన
ఆలూరు పిచ్చేశ్వరరావు జననం : కథకుడు అనువాదకుడు నవలా రచయిత స్క్రీన్ ప్లే రైటర్గా అయినా అట్లూరి పిచ్చేశ్వర రవి 1925 ఏప్రిల్ 12వ తేదీన కృష్ణా జిల్లాల జన్మించారు.. . ఈయన ప్రముఖ కవి సంఘసంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రికయైన చౌదరాణి వివాహం చేసుకున్నారు, గౌతమ్ బుద్ధ, వీరేశలింగం లాంటివి పిచ్చేశ్వరరావు రచనల . అవి తెలుగు భాషలో ఎంతో ప్రసిద్ధి చెందినవి. అయిన చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా కూడా ప్రసిద్ధి చెందాడు.
అమరపు సత్యనారాయణ జననం : కలియుగ కృష్ణుడు పరిస్థితుల్లోనైనా అమరపు సత్యనారాయణ 1935 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. చిన్నతనం నుంచి పాటలు నాటకాలపై ఎంతో ఆసక్తి కనబరిచిన అమరపు సత్యనారాయణ... అందరినీ ఆకట్టుకునే వాడు.
జ్వాలా ముఖి జననం : ప్రముఖ రచయిత కవి నాస్తికుడు భారత సైన్యం మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన జ్వాలాముఖి 1938 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకరు. అంతేకాకుండా ఈయన ఎన్నో రచనలు కూడా రచించారు.
రాజ్ కుమార్ మరణం : భారత చలన చిత్ర నటుడు గాయకుడు అయిన రాజ్ కుమార్ ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించడమే కాదు... సినిమాలో గాయకుడిగా ప్రేక్షకులను అలరించాడు. ఈయన 2006 ఏప్రిల్ 12వ తేదీన మరణించారు