మే 18 వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జరిగిన జననాలు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.
ఆలివర్ హివిసైడ్ జననం : ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయిన ఆలివర్ హివిసైడ్ 1850 మే 18వ తేదీన జన్మించారు. ఈయన భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి కొత్త విషయాలను శోదించేందుకు ఎంతగానో కృషి చేశారు అయన్నోసియర్ అనేది ఒకటి ఉందని... అది రేడియో తరంగాలను ప్రవర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త ఆలివర్ హివిసైడ్. అంతేకాకుండా భౌతికశాస్త్రంలో మరిన్ని పరిశోధనలు చేసి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జననం : మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత అయిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 1877 మే 18వ తేదీన జన్మించారు. విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడైన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు... తెలుగు ప్రజలందరికీ చరిత్ర పరిశోధనలు పరిచయం చేశారు. ఉన్నత ప్రమాణాలతో చరిత్ర విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞాన వేదిక కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. 46 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన పరమపదించారు. తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. అంతేకాకుండా ఎందరో సాహితీ మూర్తులకు సహచరుడిగా కూడా ఉన్నారు. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. కందుకూరి వీరేశలింగం పంతులు గురజాడ అప్పారావు గిడుగు రామమూర్తి వీరందరితో సహచరుడు గా పనిచేశారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు.
సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ జననం : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సంఘసేవకురాలు అయినా సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ 1914 మే 18వ తేదీన జన్మించారు. అండమాన్ వెళ్లి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. మహిళా ఉద్యమాలు, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలు కీలక యోధురాలిగా ఎంతో ముందుంది పాటుపడింది.మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడింది సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. 1952 లో తెలుగు దేశం అనే పత్రికను నడిపింది. 1920లో జాతిపిత గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ సేవకు పూనుకున్నారు రాజ్యలక్ష్మమ్మ. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనేందుకు ఆమె ప్రయత్నించారు.
అశోక్ కుమార్ దత్తా మరణం : బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము నకు ఆద్యులలో ఒకరైన అక్షయ్ కుమార్ దత్తా 1886 మే 18వ తేదీన మరణించారు.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య మరణం : ప్రముఖ రచయితలలో పేరెన్నికగన్న వ్యక్తి అయినా పెద్దిబొట్ల సుబ్బరామయ్య 2018 మే 18వ తేదీన జన్మించారు. ఈయన రచనలు అత్యధిక శాతం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలు గా ఉంటాయి.