ఆగస్టు 17వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు  ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.



 నిధి అగర్వాల్ జననం : దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి నిధి అగర్వాల్ 1993 ఆగస్టు 17వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది . ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం నటనతోనే కాకుండా తన అందచందాలతో కూడా తెలుగు ప్రేక్షకులందరినీ తన బుట్టలో వేసుకుంది ఈ అమ్మడు. అంతేకాకుండా వరుస  అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది.




 శ్రీకృష్ణ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ కృష్ణ 1983 ఆగస్టు 17వ తేదీన జన్మించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుల్లో  శ్రీ కృష్ణ ఒకరు. శ్రీకృష్ణ ఎన్నో వైవిధ్యమైన పాటలు పాడి  ఎంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో కూడా తనదైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శ్రీకృష్ణ... అంతే కాకుండా అలా వైకుంఠపురములో  సినిమాలో కూడా పాడారు శ్రీకృష్ణ, ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో  పాటలు పాడి తనదైన గాత్రంతో ఎంతో  మంది సంగీత ప్రేమికులను అలరిస్తున్నారు



 నటాషా జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయిన నటాషా 1982 ఆగస్టు 17వ తేదీన జన్మించారు. నటాషా ఎక్కువగా తెలుగు చిత్రపరిశ్రమలో అనిత అనే పేరుతో సుపరిచితురాలు. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నటాషా  తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు హిందీ కన్నడ తమిళ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించి నటాషా . అంతే కాకుండా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది.




 శంకర్ జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు శంకర్ 1964 ఆగస్టు 17 వ తేదీన జన్మించారు. జెంటిల్మెన్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన శంకర్.. మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ తో కూడిన సినిమాలను తెరకెక్కిస్తుంటారు  దర్శకుడు శంకర్. ఇక శంకర్ తెరకెక్కించిన సినిమాలకు భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. రోబో లాంటి సినిమాలను తెరకెక్కించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతి ని  మరింతగా పెంచారు శంకర్. ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు.




 కొడవటిగంటి కుటుంబరావు మరణం : ప్రసిద్ధ తెలుగు రచయిత హేతువాది అయినా కొడవటిగంటి కుటుంబరావు 1980 ఆగస్టు 17వ తేదీన మరణించారు. చందమామ  పత్రికను చందమామ గా తీర్చిదిద్దిన ప్రముఖులలో కొడవటిగంటి కుటుంబరావు అగ్రగణ్యుడు. మానవ జీవనాన్ని పరామర్శించి విమర్శించి సుసంపన్నం చేసే సరైన సాహిత్యంగా ఆయన భావించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: