ముఖ్య సంఘటనలు
1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.
1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
2011: భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.
ప్రముఖుల జననాలు
1907: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
1920: బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)
1940: కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త.
1960: విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.
ప్రముఖుల మరణాలు
1900: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)శ్రీ పరవస్తు వెంకట రంగాచార్యులు 1822, మే 22 న విశాఖపట్నంలో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు సంస్కృతం, ప్రాకృతం భాషలలో నిష్ణాతులు. విశాఖపట్నం లోని "గ్రంధ ప్రదర్శిని" నిర్వాహకులు.
1988: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)
2008: సయ్యద్ హుసేన్ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939).నాటక రంగంలో మంచి నటుడిగా ఖ్యాతిగాంచిన సయ్యద్ బాషా హుసేన్ చలన చిత్రాలలో కూడా నటించారు. స్వయంగా స్క్రిపును రూపొందించిన 'పెద్దింటి కోడలు', 'ఉత్తమురాలు' సినిమాల్లో నటించారు. అటవీ శాఖలో రేంజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన సయ్యద్ బాషా హుసేన్ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సినిమాలకు రచయితగా సహకారం అందించారు.
2016: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
2016: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)