గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 5వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..


1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం

ప్ర‌ముఖుల జననాలు

1915: గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963)
1920: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997)
1937: ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (మ.2016)
1946: పా౦ెట్ ౦ాంపల్౦౧్

ప్ర‌ముఖుల మరణాలు

1679: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ డచ్ కవి, నాటక రచయిత. (జ.1587)
1961: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)గ్రంథాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పనిచేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. దానితో ఆయన జైలు పాలు అయ్యాడు. వంటపనిలో, ప్రూఫ్ రీడింగ్‌లో, హోటల్ సర్వర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేశాయి. నిజాంను గడగడలాడించిన 'ఆంధ్రమహాసభ' నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాడు.
1988; బెళ్లూరి శ్రీనివాసమూర్తి, రాయలసీమ కవికోకిలగా పేరొందిన కవి. (జ.1910)బెళ్లూరి శ్రీనివాసమూర్తి. తండ్రి బెళ్లూరి హనుమంతరావు కూడా సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు. శ్రీనివాసమూర్తి పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం ఇతని బాల్యమిత్రులు. ఈ ముగ్గురూ కొన్నాళ్ళు రాయలసీమలో 'కవిత్రయంగా' వాసికెక్కారు.
2016: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. ఆయన రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్‌ తోను వ్యాపార ప్రకటనా సంస్థ స్థాపించారు. కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: