గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 12 వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు..

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ,1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించాడు. [1] రోజురోజుకూ పెరిగే సత్యాగ్రహులతో యాత్ర సాగి, 24 రోజుల తరువాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6 న, ఉదయం 6:30 గంటలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు, ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది.

2007: భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.

ప్ర‌ముఖుల జననాలు..

1913: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1937: శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.
1947: ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు. బాపు, వడ్డాది పాపయ్య లకు ఏకలవ్య శిష్యుణ్ణని వినయంగా చెప్పుకునే ఇతడు, బాపు వ్యంగ్య చిత్రాల వల్ల ప్రేరణ పొంది కార్టూనింగ్ రంగానికి వచ్చాడు. బొమ్మలు గీయటం కష్టపడి మదరాసు డ్రాయింగ్ స్కూలులో నేర్చుకున్నాడు.
1954: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.
1975: వి.అనామిక, భారతీయ సమకాలీన కళాకారిణి.

ప్ర‌ముఖుల మరణాలు

1976: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896)
2017: భూమా నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1964)

మరింత సమాచారం తెలుసుకోండి: