గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 17వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1967: భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త,ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు .
2012: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ప్ర‌ముఖుల జననాలు

1887: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)
1892: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (మ.1984)
1896: మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధుడు మందుముల నరసింగరావు మార్చి 17, 1896 న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించాడు. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు, పత్రికా రచయితగా పేరుపొందాడు.
1936: కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి.
1957: నామా నాగేశ్వరరావు, వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.
1962: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (మ.2003)
1963: రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1973: పెద్ది రామారావు, నాటకరంగ ముఖ్యులు, కవి, తెలుగు కథా రచయిత, రంగస్థల అధ్యాపకులు.
1990: సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రిడాకారిణి.

ప్ర‌ముఖుల మరణాలు..

1945: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)
1961: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881)
1984: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత. (జ.1926)

మరింత సమాచారం తెలుసుకోండి: