క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు మే 1 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ప్రముఖల జననాలు:

1867: కాశీనాథుని నాగేశ్వరరావు, పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1938)

1916: గ్లెన్ ఫోర్డ్, అమెరికన్-కెనడియన్ యాక్టర్. (మ.2006)

1943: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, రచయిత్రి.

1971: అజిత్ కుమార్, తమిళ నటుడు.

1981: సుమన్ శెట్టి, తెలుగు హాస్య నటుడు.

1988: అనుష్క శర్మ, బాలీవుడ్ నటి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.

ప్రముఖుల మరణాలు:

2008: నిర్మలా దేశ్‌పాండే, గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు. (జ.1929)

2019: బి. సుభాషణ్ రెడ్డి కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.1943)

2020: పంకజ్ జావేరి, భారత క్రికెటర్. (జ. 1945)

సంఘటనలు:

1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది.

1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.

1900 - యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో ఐదవ ఘోరమైన మైనింగ్ ప్రమాదం జరిగినప్పటికి ఉటాలోని స్కోఫీల్డ్‌ లోని స్కోఫీల్డ్ మైన్ డిజాస్టర్ లో 200 మందికి పైగా మృతి చెందారు.

1929 - 7.2 మెగావాట్ల కోపెట్ డాగ్ భూకంపం ఇరాన్-తుర్క్మెనిస్తాన్ సరిహద్దు ప్రాంతాన్ని గరిష్టమైన మెర్కల్లి తీవ్రతతో తాకగా.. 3,800 వరకు మరణించగా.. 1,121 మంది గాయపడ్డారు.

1956 - జోనాస్ సాల్క్ అభివృద్ధి చేసిన పోలియో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

1960: గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.

2019 - భారతదేశంలోని గాడ్చిరోలి జిల్లాలో నక్సలైట్ దాడి జరిగింది. ఐఈడి పేలుడులో డ్రైవర్‌ తో సహా 16 మంది ఆర్మీ సైనికులు మరణించారు.

జాతీయ దినాలు:

మే దినోత్సవం - లేబర్ డేగా 66 దేశాలలో జరుపుకుంటారు.

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: