క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 4 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.



ప్రముఖుల జననాలు:



1649 - ఛత్రసల్, భారత పాలకుడు (మ .1731)



1767: త్యాగరాజు, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847)



1855 - గ్రేఫ్రియర్స్ బాబీ, యజమాని సమాధికి 14 సంవత్సరాల పాటు కాపలా కాసిన కుక్క (మ .1872)



1911: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.



1934: అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.



1942: దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)


1943 - ప్రశాంత పట్నాయక్, భారత ఆర్థికవేత్త, విద్యావేత్త



1950: కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.



1950: నరమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.



1952 - బెలిండా గ్రీన్, ఆస్ట్రేలియన్ అందాల రాణి, 1972-మిస్ వరల్డ్



1957 - పీటర్ స్లీప్, ఆస్ట్రేలియా క్రికెటర్



1960: డి. కె. అరుణ, పరిశ్రమల శాఖ మంత్రి.



1985 - రవి బొపారా, ఇంగ్లీష్ క్రికెటర్



ప్రముఖల మరణాలు:



1979: గుడిపాటి వెంకట చలం, రచయిత. (జ. 1894)


1799: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750)



సంఘటనలు 



1799 - నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం: సెరింగపటం యుద్ధం: జనరల్ జార్జ్ హారిస్ నాయకత్వంలో, సెరింగపటం నగరం ఆక్రమించబడినప్పుడు, టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యం చేత చంపబడినప్పుడు సెరింగపటం ముట్టడి ముగిసింది.



1927 - అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విలీనం చేయబడింది.


1949 - టొరినో ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళందరూ విమాన ప్రమాదంలో మరణించారు. చివరి నిమిషం లో యాత్ర క్యాన్సిల్ చేసుకున్న ఇద్దరు ఆటగాళ్ళు సౌరో టోమే రెనాటో, గండోల్ఫీ మాత్రం బతికిపోయారు.



పండుగలు, జాతీయ దినాలు:



అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం .



వరల్డ్ గివ్ ( give ) డే.

మరింత సమాచారం తెలుసుకోండి: