క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 19 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ప్రముఖుల జననాలు:

1894: గుడిపాటి వెంకట చలం, కథా, నవల రచయిత. (మ.1979)

1908: జేమ్స్ స్టీవర్ట్, అమెరికన్ నటుడు.

1908 - మానిక్ బందోపాధ్యాయ, భారతీయ రచయిత, కవి, నాటక రచయిత (మ.1965)

1910: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)

1913: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి.(మ. 1996)

1915: మోషే డయాన్, ఇజ్రాయల్ సైనిక అధికారి.

1934: పి.లీల, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.

1934 - రస్కిన్ బాండ్, భారతీయ రచయిత, కవి.

1946: చెర్, అమెరికన్ నటి.

1974: నవాజుద్దీన్ సిద్దిఖీ, భారతీయ నటుడు

ప్రముఖుల మరణాలు:

1904 - భారతీయ వ్యాపారవేత్త జమ్సెట్జీ టాటా టాటా గ్రూప్‌ను స్థాపించారు (జ .1829)

1952: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878)

1958 - జదునాథ్ సర్కార్, భారత చరిత్రకారుడు (జ .1870)

1970: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. (జ.1894)

1985: పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913)

2008 - విజయ్ టెండూల్కర్, భారతీయ నాటక రచయిత, స్క్రీన్ రైటర్ (జ. 1928)

ముఖ్య సంఘటనలు:

1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది. ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం.

1927 : సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.

1944 : అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.

1990 : మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.

1991 : సోవియట్ ప్రభుత్వం, దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకునే తన పౌరులను, దేశం వదిలిపోవటానికి అనుమతించింది.

జాతీయ దినాలు:

ప్రపంచ తాపజనక ప్రేగు వ్యాధి దినం

మరింత సమాచారం తెలుసుకోండి: