క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 28 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రముఖుల జననాలు:
1883: వినాయక్ దామోదర్ సావర్కర్, భారతీయ కవి, రాజకీయవేత్త (మ. 1966)
1895: మాధవరావు బాగల్, స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు,
రచయిత, కళాకారుడు.
1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
1903: ఎస్.ఎల్. కిర్లోస్కర్, భారతీయ వ్యాపారవేత్త, కిర్లోస్కర్ గ్రూప్‌ను స్థాపించారు (మ. 1994)
1921: డి.వి. పలుస్కర్, భారతీయ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతకారుడు (మ .1955)
1941:
సురేఖ (సురేఖ కలం పేరు లాంటిది), ఆయన అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు.
1946: కె. సచ్చిదానందన్, భారత కవి, విమర్శకుడు.
1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ
క్రికెట్ క్రీడాకారుడు.
1958:
సునీల్ దేశ్‌ముఖ్, భారతీయ రాజకీయవేత్త.
1986: సేథ్ రోలిన్స్, అమెరికన్ రెజ్లర్.
1996: గట్టెం
వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు.
ప్రముఖుల మరణాలు:
1997: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధి చెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930)
1999: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు
సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920)
2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ
ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921)
2003: ఇలియా ప్రిగోగిన్, రష్యన్-బెల్జియన్ రసాయన శాస్త్రవేత్త, విద్యావేత్త,
నోబెల్ బహుమతి గ్రహీత (జ .1917)
సంఘటనలు:
1930: లాహోర్ లోని
రవి నది ఒడ్డున బాంబును పరీక్షించేటప్పుడు విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడు భగవతి చరణ్ వోహ్రా మరణించారు. భగవతి చరణ్ వోహ్రా ని భగత్ సింగ్ వంటి గొప్ప సమరయోధుడుగా పిలుస్తుంటారు.
1937: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ స్థాపించబడింది.
1964: జవహర్‌లాల్ నెహ్రూ దహన సంస్కారాలు జరిగాయి. ఆయన దహన సంస్కారాలకు వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. పది లక్షలకు పైగా భారతీయులు అతని భౌతిక కాయం తరలించే మార్గంలో బారులు తీరారు.
1965:
ధన్బాద్ బొగ్గు గని విపత్తు. ఈ పేలుడులో 268 మంది బొగ్గుగని కార్మికులు మరణించారు.
1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
1998: భారతదేశం చేసిన అణు పరీక్షల పరంపరకి ప్రతిస్పందనగా పాకిస్తాన్.. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని రాస్ కో హిల్స్‌లో చాగై -1 లతో ఐదు భూగర్భ అణు పరీక్షలు జరిపింది. దీని ఫలితంగా
అమెరికా,
జపాన్ లతో పాటు ఇతర దేశాలు పాకిస్తాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రతి సంవత్సరం ఈ రోజును పాకిస్తాన్‌లో యూమ్-ఎ-తక్బీర్ గా జరుపుకుంటారు.
1999: 22 సంవత్సరాల పునరుద్ధరణ పనుల తరువాత, ఇటలీలోని మిలన్ లో లియోనార్డో డావిన్సీ యొక్క
మాస్టర్ పీస్ "ది లాస్ట్ సప్పర్" తిరిగి ప్రదర్శనలో ఉంచబడింది.
2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత
నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
జాతీయ దినాలు:
నేపాల్ గణతంత్ర దినోత్సవం, ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం.