ప్ర‌తి సంవ‌త్స‌రంలో ఉండే తేదీలో ఎన్నో విశేషాలు, ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటాయి. ఆ తేదీలు ఎన్నో ప్ర‌ముఖ‌మైన చ‌రిత్ర‌ల‌కు సాక్ష్యంగా నిలుస్తాయి. ఖ‌చ్చితంగా ఆ డేట్ రోజుఏదో ఒక ప్రాముఖ్య‌మైన స‌న్నివేశం జ‌రిగి ఉంటుంది. ఇక అలాంటి తేదీల‌ను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా కామ‌న్‌. ఇక చరిత్ర‌లో ఈరోజు జూన్ 14కి కూడా చాలా వివేష‌త ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

♥ జననాలు ♥

✦  1916:  ప్ర‌ముఖ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు అయిన‌బుచ్చిబాబు (మ.1967) జ‌న్మించారు.

✦  1928: దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు అయిన చే గువెరా(మ.1967) జ‌న్మించారు.

✦  1963: మోటివేష‌న్ కౌన్సెల‌ర్ అయిన గోనె రాజేంద్ర ప్ర‌సాద్ జ‌న్మించారు.

 
♡ మరణాలు ♡

✦ 1534: రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు అయిన చైతన్య మహాప్రభు(జ.1486) ఈరోజు మ‌ర‌ణించారు.

✦ 1961: భారతీయ భౌతిక శాస్త్రవేత్త, పద్మభూషణ్ గ్రహీత అయిన‌ కె శ్రీనివాస కృష్ణన్(జ.1898) మ‌ర‌ణించారు.

✦ 2008: కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత అయిన నాగబైరవ కోటేశ్వరరావు‎(జ.1931) ఈరోజు మ‌ర‌నించారు.

✦ 2014: తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి తెలంగాణ శకుంతల (జ.1951) మ‌ర‌ణించారు.

✦ 2014: కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు అయిన కానేటి మోహనరావు(జ.1928) ఈరోజు మ‌ర‌ణించారు.


✷ పండుగలు , జాతీయ దినాలు ✷

✦  పతాక దినోత్సవం.
✦  ప్రపంచ రక్త దాతల దినోత్సవం.
 

✷ సంఘటనలు ✷

✦  1777:  ఈరోజు చుక్కలు, అడ్డగీతలతో అమెరికా ప్రస్తుత పతాకము అమలుపరచబడింది ఈరోజు అమెరికా ఫ్లాగ్ డే.

✦  1967: ఈరోజు ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించి చ‌రిత్ర‌లో నిలిచింది.

✦  1982: ఈరోజు అర్జెంటీనా సైన్యం, బ్రిటిష్ సైన్యానికి, ఫాక్ లేండ్ లో లొంగిపోయి ఓడిపోయింది.

✦  2005: ప్రపంచ రక్త దాతల రోజు టుడే. కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను ఈరోజు కనుగొన్నందుకు 1930 లో ప్ర‌ముఖ నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా జరుపుకుంటున్నారు.

✦  2005: ఈరోజు వంద మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో నెల‌కొల్పి చ‌రిత్ర సృష్టించింది.

✦  2009: ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఈరోజు ఎన్నికయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: