ప్రతి ఏడాదిలో ఉండే ఎన్నో తేదీలకు ఎన్నో విశేషాలు, వింతలు కలిగి ఉంటాయి. కాగా ఆయా తేదీల్లో ఎన్నో రకాల విశేషమైన ఘటనలు జరిగి ఉంటాయి. కాగా ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం జరిగి తీరుతుంది. ఇక కాబట్టి తేదీలను మనం గుర్తు పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. మరి చరిత్రలో ఈరోజు జూన్ 22కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
♥ జననాలు ♥
✦ 1898: కర్ణాటక సంగీత విద్యాంసులు, వాగ్గేయకారులు అయిన చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై(మ.1975) జన్మించారు.
✦ 1932: భారత సినిమా నటుడు అయిన అమ్రీష్ పురి(మ.2005) ఈరోజు జన్మించారు.
✦ 1939: ఇజ్రాయిల్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన అడాయీ యోనత్ జన్మించారు.
✦ 1945: నాటక, సినీ రచయిత అయిన గణేష్ పాత్రో(మ.2015) జన్మించారు.
✦ 1954: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి అయిన దేవినేని నెహ్రూ(మ.2017) జన్మించారు.
♡ మరణాలు ♡
✦ 1951: భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు అయిన చిలుకూరి నారాయణరావు(జ.1889) మరణించారు.
✦ 1975 : దేశ సేవకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన అన్నే అంజయ్య(జ.1905) మరణించారు.
✦ 1969: అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి అయిన జూడీ గార్లాండ్(జ.1922) మరణించారు.
✦ 1994: తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయిన ఎల్.వి.ప్రసాద్(జ.1908) మరణించారు.
✦ 2003: కోదాటి లక్ష్మీ నరసింహారావు మరణించారు.
✦ 2008: అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, రచయిత అయిన జార్జ్ కార్లిన్(జ.1937) మరణించారు.
✦ 2016: రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు అయిన జె. వి. రమణమూర్తి(జ.1933) మరణించారు.
✷ సంఘటనలు ✷
✦ 1897: 'రాండ్', 'ఆయెర్ స్ట్' అనే ఇద్దరు బ్రిటిష్ కు చెందిన వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో 'ఛాపేకర్ బ్రదర్స్ (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి), మహాదెవ్ వినాయక్ రనడే లు కలిసి వారిని హతమార్చారు. ఛాపేకర్ సోదరులు, అయితే రనడే దొరికిన తరువాత, బ్రిటిష్ పాలకులు వారిని ఉరి తీసేశారు. ఖండొ విష్ణు సాథె అనే స్కూల్ స్టూడెంట్, కుట్రకు సహకరించాడని 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను అమలు చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులుగా వీరికి గుర్తింపు ఉంది. 1897 జూన్ 22 అనే మరాఠీ సినిమా ఈ సంఘటనకు నిదర్శనం.
✦ 1940: సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఈరోజు స్థాపించాడు.
✦ 1952: విశాలాంధ్ర అనే తెలుగు దినపత్రిక ఈ రోజు ప్రారంభమైంది.