క్యాలెండర్ లోని ప్రతీ దినానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే చరిత్రలో జూన్ 24వ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో.. ఆ రోజున జన్మించిన ప్రముఖులు ఎవరో.. మరణించిన ప్రముఖులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

♥ జననాలు ♥

✦ 1896: జి.వి. కృపానిధి, అనేక ఆంగ్ల పత్రికలలో పాత్రికేయుడిగా పనిచేసిన తెలుగు వాడు.

✦  1902: గూడవల్లి రామబ్రహ్మం, చిత్ర దర్శకుడు, సంపాదకుడు, హేతువాది, ఫ్రీడమ్ ఫైటర్.

✦  1902: జమిలి నమ్మాళ్వారు, సుప్రసిద్ధ బహుభాషావేత్త, ప్రచురణకర్త, సంపాదకుడు, రచయిత.

✦ 1915: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు కథా రచయిత, సినీ రచయిత, హేతువాది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

✦ 1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. ఆయన కాలం పేరు అమరేంద్ర. తన కలం పేరుతోనే నరసింహశాస్త్రి సుప్రసిద్ధులయ్యారు.

✦ 1928: ఎం.ఎస్. విశ్వనాథన్, ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్. 1200 సినిమాలకు సంగీత బాణీలు అందించిన గొప్ప సంగీత దర్శకుడు.

✦ 1937: అనితా దేశాయ్, భారతీయ-అమెరికన్ రచయిత, విద్యావేత్త.

✦ 1940: మురళీమోహన్, టాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటిషన్, జయభేరి గ్రూప్ అధినేత.

✦ 1966: విజయశాంతి, భారతీయ సినిమా నటీమణి, నిర్మాత, పొలిటిషన్.


♡ మరణాలు ♡

✦ 1890: తల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ తత్త్వవేత్త, అఖండ మేధాశాలి, న్యాయవాది.

✦ 1908: స్టీఫెన్ గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు, రాజకీయవేత్త, అమెరికన్ న్యాయవాది, అమెరికా దేశానికి 22, 24వ అధ్యక్షుడిగా పనిచేశాడు. (జ.1837).

✦ 1964: కొత్త రాజబాపయ్య, ఉపాధ్యాయ వృత్తికి గొప్ప ఖ్యాతి తెచ్చిన వ్యక్తి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, రాష్ట్ర విద్యా సలహా సంఘం సభ్యుడు.

✦ 1969 - ఫ్రాంక్ కింగ్, అమెరికన్ కార్టూనిస్ట్ (జ .1883)

✦ 1980 - వి. వి. గిరి, భారత న్యాయవాది, రాజకీయవేత్త, 4వ భారత రాష్ట్రపతి (జ. 1894)

✦ 1987 - జాకీ గ్లీసన్, అమెరికన్ నటుడు, హాస్యనటుడు, నిర్మాత (జ .1916)

✦ 2008: మల్లికార్జునరావు, ప్రముఖ టాలీవుడ్ హాస్యనటులుగా రాణించారు, రంగ స్థల హాస్య నటులుగా ఓ వెలుగు వెలిగిన మల్లికార్జునరావు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు మూడుసార్లు ప్రధాన కార్యదర్శి అయ్యారు, .'లేడీస్‌ టైలర్‌' మూవీలో బట్టల సత్యం పాత్ర చక్కగా పోషించి బాగా పాపులర్ అయ్యారు.

✦ 2015: పుల్లెల శ్రీరామచంద్రుడు, రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితులు.

✷ సంఘటనలు ✷

✦ 1922 - అమెరికన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ పేరు నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ గా మార్చబడింది.

✦ 1947: వాషింగ్టన్ లోని మౌంట్ రైనర్ సమీపంలో మొదటి UFO చూశానని కెన్నెత్ ఆర్నాల్డ్ వెల్లడించాడు.

✦  2002: టాంజానియాలో సంభవించిన ఇగాండు రైలు విపత్తు ఆఫ్రికన్ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం. ఈ ఘటనలో 281 మంది మరణించారు.

✦ 2013: అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు.. తక్కువ వయస్సు గల వేశ్యతో లైంగిక చర్యకు పాల్పడినందుకు.. ఇటాలియన్ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.

✷ పండుగలు, జాతీయ దినాలు ✷

✦  ఇంటర్నేషనల్ ఫెయిరీ డే.

✦  ప్రపంచ యూఎఫ్ఓ డే.

మరింత సమాచారం తెలుసుకోండి: