మనం ముందుకు సాగుతున్న ఈ కాలంలో మన ముందు గతంలో జరిగిన విషయాలు గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు తెలుసుకోవడం వివేకం..కాబట్టి ఖచ్చితంగా చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఇక చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే...1608 సంవత్సరంలో క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపించాడు.1767 సంవత్సరములో ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్రలో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టడం జరిగింది.ఇక ఆ దీవికి అతని పేరుతోనే పిట్కేర్న్ దీవి అని పేరు పెట్టడం జరిగింది.ఇక అలాగే అడ్రెస్సీవిసెన్ అనే పేరుగల నార్వే దేశపు వార్తాపత్రిక మొదటిసారిగా ముద్రించడం జరిగింది. ఆ పత్రికను ఇప్పటికి కూడా ముద్రిస్తున్నారు.

ఇక 1819 వ సంవత్సరంలో అమెరికా లోని, న్యూయార్క్ లో ది బ్యాంక్ ఆఫ్ సేవింగ్స్ అనే సేవింగ్స్ బ్యాంక్ మొట్టమొదటగా స్టార్ట్ చేశారు.1863 వ సంవత్సరంలో అమెరికన్ సివిల్ వార్ లో భాగంగా జరిగిన గెట్టిస్ బర్గ్ యుద్ధం అంతమవ్వడం జరిగింది.1884 వ సంవత్సరంలో డౌ జోన్స్ అండ్ కంపెనీ ముద్రణా కంపెనీ మొట్ట మొదటి సారిగా స్టాక్ ఏవరేజ్ ని ముద్రించింది. ఈ కంపెనీని ముగ్గురు విలేకరులు ' ఛార్లే స్ డౌ ', 'ఎడ్వర్ద్ జోన్స్ ', 'ఛార్లెస్ బెర్గ్ స్ట్రెస్సెర్ ' మొదలు పెట్టారు.1886 వ సంవత్సరంలో ' కార్ల్ బెంజ్ ' పేటెంట్ పొందిన 'మోటారు వేగన్ ' ని మొట్ట మొదటి సారిగా అధికారికంగా రిలీజ్ చేసాడు.ఇక అలాగే మొట్టమొదటి లినో టైపు యంత్రాన్ని (పుస్తక ముద్రణలో వాడే యంత్రం) 'ది న్యూ యార్క్ ట్రిబ్యున్ ' అనే వార్తా పత్రిక వాడటం జరిగింది. ఇక అంతకు ముందు, పత్రికా ముద్రణలో, అత్యంత శ్రమతో కూడి, చేతితో కూర్చే ' టైప్ సెట్టింగ్ విధానం ' అప్పట్లో వాడేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి: