పుణ్యభూమి, వేదభూమియైన భారత్‌లో స్త్రీకి ఇచ్చే చాలా గౌరవం ఇస్తారు. కానీ, మనం చెప్పుకోబోయే ఈ రాజు మహిళను అంగడి సరుకుగా భావించాడు. ఆయనే పటియాల సంస్థాన రాజు భూపేందర్ సింగ్. తన పాలనతో రాజ్యాన్ని భ్రష్టుపట్టించాడు. ఈ రాజు రంగులమయ ప్రపంచాన్ని, వింత కామ క్రీడలను గురించి ఆయన వద్ద దివానుగా పని చేసిన జెర్మనీదాస్ ‘మహారాజ మహారాణి’ అనే గ్రంథం రాశాడు. దాని ప్రకారం..పటియాల సంస్థాన రాజు రాజేందర్ సింగ్ కుమారుడైన భూపేందర్ సింగ్ తండ్రి మరణానంతరం రాజ్యపాలకుడిగా మారాడు. రాజ్య ప్రజల రక్షణ, సంక్షేమం పక్కనపెట్టి ప్రజా కంఠకుడిగా మారాడు.
లీలామహల్‌కు ముందర పెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించి రాజు అక్కడ స్త్రీలతో ఈత కొట్టేవాడు. దాదాపు 150 మంది మహిళలు, పురుషులు ఒకేసారి ఆ కొలనులో ఈత కొట్టచ్చు. 10 కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న రాజు భూపేందర్ సింగ్‌కు ఒక అంచనా ప్రకారం..80 మంది పిల్లలున్నారు. రాజ్యపాలన కోసం ఉన్న మోతీలాల్ ప్యాలెస్ విడిచి ఎప్పుడూ లీలామహల్‌లోనే ఉండే భూపేందర్ సింగ్ ప్రజలను అసలు పట్టించుకునేవాడు కాదు.