మహాత్మాగాంధీ అలియాస్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తుంటారు. సత్యం, అహింస గాంధీ నమ్మే సిద్ధాంతాల మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. కేవలం వీటితోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశానికి స్వతంత్రం సాధించిన నాయకుల్లో ముఖ్యులయ్యారు. అటువంటి మహాత్ముని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత జాతిపిత మహాత్మాగాంధీ. 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీజీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడెమో అంటే అతిశయోక్తే లేదు. మహాత్మాగాంధీ మాతృభాష గుజరాతి.