భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచం అంతటా చాటి చెప్పిన స్వామీ వివేకానంద జనవరి 12 వ తేదీన జన్మించారు. అందుకే ఆయన పుట్టిన ఈ పవిత్ర దినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.ఈయన రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. అంతేగాక వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాములలో సమాజంలో అత్యంత ప్రభావాన్ని కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. వివేకానంద బోధనలు ఎప్పుడూ యువతకు స్పూర్తినిస్తూనే ఉంటాయి. యువతలో చైతన్యాన్ని నింపుతున్నాయి.హిందూ తత్వచరిత్ర, భారతదేశ చరిత్రలతోనే భారతదేశాన్ని జాగృతి చేయ్యడమే కాకుండా అమెరికా ఇంకా ఇంగ్లాండ్ వంటి పొరుగు అగ్ర రాజ్యాల్లో కూడా ఆయన ప్రసంగించాడు.ఈయన ఉపన్యాసాలు ఇచ్చి వాదనలు ద్వారా పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి. వివేకానంద ప్రసంగానికి ముగ్దులైన అమెరికా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా మంది ఆయనకి శిష్యులయ్యారు.


స్వామి వివేకానంద 125 ఏళ్ళ క్రితం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో  చేసిన  ప్రసంగం  ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తాయి.  "అమెరికా దేశపు ప్రియమైన సహోదరులారా" అంటూ స్వామి వివేకానంద ప్రసంగం మొదలుపెట్టినపుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో ఆ మహాసభ ఎంతగానో మారుమ్రోగిపోయింది. ఇంగ్లిష్ లో స్వామి వివేకానందుని ప్రసంగానికి అమెరికా ప్రజలు నీరాజనాలు పలికారు. చికాగోలో ఆయన మొదటి ప్రసంగం  ఈరోజుకు కూడా ప్రపంచం అంతా గురుతుచేసుకునేదిగానే నిలిచి ఉంది. అది నిజంగా అద్భుత సంఘటన. అప్పట్లో చికాగోలో సర్వమత సమ్మేళనానికి వేలాది మంది ప్రతినిధులు తరలివచ్చారు.అక్కడ భారతదేశం తరపున వచ్చిన వారిలో స్వామి వివేకానంద ఒక్కరే పిన్న వయస్కుడు కావడం మరో విశేషం. ఆ ఒక్క ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా స్వామి వివేకానంద పేరు మారుమోగి పోయింది.చరిత్రలో ఈ రోజు ప్రతి భారతీయుడికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్వామి వివేకానంద అంటే పేరు మాత్రమే కాదు.. ఆయనంటే ఆదర్శం.. స్ఫూర్తి.. ధైర్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: