స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగరేస్తాం.కానీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం?అయితే వాటి మధ్య ఉన్న తేడా ఏంటో చాలా మందికి కూడా తెలీదు. ఆ తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ మన భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి సంవత్సరం ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఇంకా అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి సంవత్సరం ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా మూడు రంగుల జెండాని ఆవిష్కరించి చాలా ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి ఇంకా జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.


ఇక ఆ తేడా ఏంటంటే.. ప్రతి ఏడాది ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం కింద కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి మూడు రంగుల జెండాని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జాతీయ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా మూడు రంగుల జెండాని పైకి లాగి ఎగురవేస్తారు. ఇక ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రంగుల జాతీయ జెండాని పైభాగంలో కట్టి దాన్ని పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం.అంటే దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం.అందుకే ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: