మన రాష్ట్రానికి సంబంధించిన చరిత్రలు కానీ.. మన దేశానికి సంబంధించిన చరిత్రలు గతంలో పాఠ్యపుస్తకాల్లో ఉండేవి. మారుతున్న విద్యావిధానాలతో ప్రస్తుతం అవి ఉండటం లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని చదివేఅంత తీరిక.. ఓపిక మనకి  ఉండటం లేదు. కనీసం అప్పుడు అప్పుడు అయినా వాటి గురించి తెలుసుకుందాం.  దేశంలోనే ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరస్వామి వేంచేసియున్న చిత్తూరు జిల్లాను తీసుకుంటే నెల్లూరు నుంచి నాయుడి పేట దాటిన శ్రీకాళహస్తి తర్వాత తిరుపతి ప్రాంతం మొదలవుతుంది.


అసలు తిరుపతి ఏది అంటే తిరుమల, శ్రీకాళహస్తి, రేణిగుంట, నగరి, సత్యవేడు, చంద్రగిరి, పుత్తూరు, తిరుపతి. చిత్తూరు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొన్నై నది ఒడ్డున ఉంది. ఈ పట్టణం దాని సమీపంలోని దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర, తమిళ సంస్కృతుల మేళవింపు చిత్తూరులో కనిపిస్తుంది. చిత్తూరు అనే పేరు ఒక తమిళ పదం. దీని అర్థం చిన్న పట్టణం. ఇది తొండైనాడు అనే తమిళ నియోజకవర్గంలో భాగంగా ఉన్నందున దీనికి తమిళ పేరు ఉంది.


అయితే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తిరుపతి మాకు కావాలని తమిళనాడు ప్రజలు పేచీ పెట్టారు. చాలా సంఘటనల తర్వాత తిరుత్తాడిని తమిళనాడు వాళ్లకి ఇచ్చి సత్యవేడును మనం తీసుకున్నాం. అందువల్ల తమిళ ప్రాబల్యం మొదటి నుంచి ఎక్కువగానే ఉంది.  అందుకే తిరుమల దేవాలయంలో తమిళులే ఎక్కువగా ఉంటుంటారు.  అలాగే ఒకవైపు కర్ణాటక, మరోవైపు తమిళనాడుకి దగ్గరగా ఉండటంతో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.


మద్రాసు నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 1959లో సరిహద్దు గురించి కొంత వివాదం నడిచింది. ఈ వివాదాలను పటాస్కర్ కమిషన్ పరష్కరించింది. దీని ప్రకారం తిరుత్తణి చిత్తూరు నుంచి మద్రాసు రాష్ట్రానికి.. పొన్నేరి, తిరువళ్లూరు తాలూకా నుంచి కొన్ని ప్రాంతాలను చిత్తూరు జిల్లాలోకి మార్పులు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: