మొన్నటి దాకా కూడా టాలీవుడ్‌లో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ మాటలతో సోషల్ మీడియాలో యుద్ధాలు చేసేవారు. కానీ కల్కి సినిమాతో ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. ఈ సినిమా పుణ్యమా అని ఇప్పుడు భారత దేశ ప్రజలు గర్వించదగ్గ చరిత్ర అయిన మహాభారతం హాట్ టాపిక్ అయిపోయింది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కల్కి విజువల్స్ కి ఫిదా అయిన నెటిజన్స్ చరిత్ర గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మహాభారతమే వినిపిస్తుంది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగ్ అశ్విన్ అనే చెప్పాలి. గతంలో మన పురాణాలు బేస్ చేసుకొని ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆడియన్స్ పై ఈ రేంజ్ లో మాత్రం ఇంపాక్ట్ చూపించలేదు.అప్పట్లో మహాభారతం ఆధారంగా సీరియల్స్ ఇంకా సినిమాలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి కూడా చూసుకుంటే ఏ డైరెక్టర్ కూడా దీన్ని సినిమాగా, కనీసం సీన్స్ వరకైనా తీసే సాహసం మాత్రం చేయలేదు. 


ఒకవేళ తీసినా కూడా ఏదో తూతు మంత్రంగా తీసేవారు. రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చాలా సార్లు చెప్పాడు. కాకపోతే జక్కన్న అనుకున్న ప్రకారం దీన్ని తీసేసరికి ఇంకో 10-15 ఏళ్లయినా పట్టొచ్చు. ఇంతలోనే నాగ్ అశ్విన్ అనే యంగ్ డైరెక్టర్ రయ్ అని దూసుకొచ్చాడు.మరీ పూర్తిగా కాకపోయినా సరే 'కల్కి'లో మహాభారతంలోని కురుక్షేత్రానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌తో గతంలో ఎన్నడూ చూడని ఎలివేషన్స్, విజువల్స్ యాడ్ చేసి ప్రేక్షకులని అబ్బురపరిచాడు. ముఖ్యంగా అశ్వద్థామ పాత్రని 'కల్కి'తో లింక్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. అదే ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో అసలు ఈ అశ్వద్థామ ఎవరు? అతడికి కర్ణుడితో సంబంధం ఏంటనే సీరియస్‌గా తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజన్స్. అంతలా ఈ 'కల్కి' సినిమా మన ఆడియన్స్ పై అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.కాబట్టి ఇప్పుడు మహాభారతన్ని మంచి విజువల్స్ తో ఎలివేషన్స్ తో చూపిస్తే మన దేశ చరిత్రకి ప్రపంచ దేశాలు సలాం కొట్టడం ఖాయం. మరి మన డైరెక్టర్స్ పూర్తి మహా భారతాన్ని సినిమాగా ఎప్పుడు తీస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: