శివరామపాలెం జమీందారు భూపతిరాయుడు. ఒక ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఒక సాహితీ ఏర్పాటు చేశాడు. ఆ పోటీ ఏమిటంటే పరమశివుడి పైన ఒక గంటలో వంద పధ్యాలను ఆశువుగా చెప్పాలి. విచేతకు సరస్వతీ పుత్ర బిరుదుతోపాటు వెయ్యి వరమాలు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఆ పోటీల్లో రజనీచంద్ర అనే పాతికేళ్ళ యువకుడు నారాయణాచార్యులు అనే ఒక ఎనబై ఏళ్ళ వృద్దుడూ సమ ఉజ్జీలుగా నిలిచారు జమీందారు ఎవరిని విజేతగా నిర్ణయించారు.
ఎవరిని విజేతగా నిర్ణయిస్తారో అని సభలోనివారంతా అతృతగా చూడసాగారు. జమీందారు కొద్దిసేపు ఆలోచించి నారయణాచార్యులు పోటీలో విజేతగా ప్రకటించాడు. ఆయకు బిరుదు, సన్మానాలతోపాటు వెయ్యి వరహాలు బహుమతి కూడా ఇవ్వబడింది. సభముగిశాక దివాను, జీమీందారును పోటీలో రజనీ చంద్రకాకా, నారాయణా చార్యులు నెగ్గినట్లు ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం వున్నదా ? అని అడిగారు.
అందుకు జమీందారు లేకేం దివాన్ జీ రజనీ చంద్ర యువకుడు ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అప్పడూ కాకపోతే ఆ పై ఏడాది పోటీలో పాల్గొని నెగ్గే అవకాశం వుంది. పోతే ఏ క్షణమైనా రాలిపోవటానికి సిద్దంగా ఉన్న పండుటాకు వంటివాడు నారాయణాచార్యులు! ఇప్పుడు తప్పిపోతే ఆయన విద్వత్తును సన్మానించుకునే అదృష్టం వచ్చే ఏడాది మనకు దక్కకపోవచ్చు కదా ! అన్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: