రామాపురం అనే ఒక పల్లెటూరు ఉంది. అక్కడ భూపతిరాజు, లీలా అనే భార్యాభర్తలు ఉన్నారు. వారికి రాజేష్, మహేష్ అనే ఇద్దరు పిల్లలు. ఆ ఊరికి దగ్గర్లో ఉన్న టౌన్లో రాజేష్ చదువుకుంటున్నాడు. మహేష్ ఇంకా స్కూలుకు వెళ్ళటం లేదు. ఒకసారి సెలవులకు రాజేష్ ఇంటికి వచ్చాడు. మహేష్ చేస్తున్న తుంటరి పనులను చూశాడు. చీమలను, సీతాకోకచిలుకలను, తూనీగలను, చిన్న చిన్న పిచ్చుకలు, కాకి పిల్లలు, కోడిపిల్లల్ని మహేష్ ఇష్టం వచ్చినట్టు ఏడిపించి, నవ్వుకోడం గమనించాడు. అలా చేయవద్దని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా, అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఒక్కసారి అన్నదమ్ములిద్దరూ చెరువు దగ్గరకు వెళ్ళారు. రాజేష్ స్నేహితులతో మాట్లాడుతుంటే, మహేష్ కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో భయంతో గజగజా వణికి పోయాడు. అది చూసి రాజేష్, అతని స్నేహితులు కలిసి మహేష్ ను కాపాడారు. మహేష్ కు అప్పుడు ప్రాణం విలువ తెలిసి వచ్చింది. ఇంకెప్పుడూ జీవులను హింసించ కూడదని నిర్ణయించుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: