రామాపురంలో గంగయ్య అనే సదాచార పారాయణుడు. పొరుగూరిలో ఒకరి ఇంటిలో వ్రతం జరగగా ఆ ఇంటివాళ్లు గంగయ్యకు ఒక సంచెడు ధాన్యం దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకొని ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు. దారిలో సేద తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరివాని ఇంటివద్ద ఆగి అరుగు మీద నడుంవాల్చాడు. అందుకు వాళ్ల అనుమతి కూడా తీసుకున్నాడు.  ఆ అరుగు మీదనే కుండల దొంతర ఉన్నది, తనవద్దనున్న ధాన్యం మూట గురించి ఇలా ఆలోచించసాగాడు. ‘‘ఈ మూటలోని గింజల్ని విత్తానాలుగా నా పేరిట వేస్తే అవి కొన్నాళ్లకు పెరిగి పెద్దదై పంట చేతికి వస్తుంది’’.  ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో వేస్తే చెప్పలేని ధాన్యం పండుతుంది. ఆ ధాన్యాన్ని అమ్మితే వచ్చే డబ్బుతో పాడి పశువుల్ని కొని. పాలు అమ్మితే కొన్నివేల రూపాయలు ఆదాయం వస్తుంది. అప్పేడు నేను కాలు మీద కాలు వేసుకొని మహారాజులా బతుకుతాను.  అలా సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు, అందమైన తన అమ్మాయిల్ని ఇచ్చి వివాహాం జరిపేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే నేను మాత్రం ఛీ కొట్టి నా అంతస్తుకు తగరని చెప్తాను. వాళ్లు అంతటితో ఊరుకోకుండా కాళ్లావేళ్లా పడతారు. అప్పుడు నేను ఛీ, పో అని కాలితో ఒక తన్ను తంతాను. అంటూ కుండల దొంతరలను తన్నేశాడు గంగయ్య కుండలన్నీ పగిలిపోవడం చూసి ఆ ఇంటి యజమాని కోపోద్రిక్తుడై గంగయ్యను పట్టుకొని నాల్గు తగిలించి అక్కడి నుండి తరమివేశాడు.  ఈ కథలోని నీతి : పగటి కలలు కంటూ గాలిలో మేడలు కట్టకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: