అక్బర్ రాజు, బీర్బల్ ఆయన ఆస్థానంలోని విదూషకుడే అయినా, ఇద్దరూ ఎప్పడూ సరదాగా, హస్యంగా మాట్లాడుతూ ఉండటం చేత ఆ ఇద్దరి మధ్య భాగా చనువు ఏర్పడింది. అందుచేత బీర్బల్ ఆస్థానానికి వెళ్లేముందు అక్బర్ పాదుషా ఇంటికి వెళ్ళి ఆయనతో కాస్సేపు సరదాగా మాట్లాడి, తర్వాత ఆస్థానానికి వెళ్లేవాడు.
అలా రోజు రోజుకీ వారి మధ్య అనుబంధం పెరగడంతో ఇంటికి వచ్చిన బీర్బల్ ని అక్బర్ ‘‘ఏం బీర్బల్, ఎలా ఉన్నావు? ఈ వేళ భోజనంలో ఏం తిన్నావు? అని అడిగేవాడు.
బీర్బల్ చాలా సార్లు పొన్నగంటి కూర అని చెప్పడం జరిగింది. అలా అడిగేవాడు.
బీర్బల్ చాలా సార్లు పొన్నగంటి కూర అని చెప్పడం జరిగింది. అలా వినీ ఒకరోజు అక్బర్ కి చాలా చిరాకు అనిపించింది.
‘‘ఏంటి బీర్బల్, ఎప్పుడు చూసినా పొన్నగంటి కూర తిన్నానని అంటావు? ఏం, కాస్త మంచి తిండి తినలేవా? నువ్వు చెప్తే వినీ వినీ ఆ పొన్నగంటి కూర అంటేనే నాకు అసహ్యం వేస్తుంది’’ అన్నాడు విసుగ్గా.
ఇదికాదు ప్రభూ! పొన్నగంటి కూర తింటే’’ అని బీర్బల్ ఏదో చెప్పబోగా ‘వద్దు ఆ పొన్నగంటి కూరంటేనే నాకు అసహ్యం వేస్తుంది’’ దానిగురించి తప్ప వేరే దాని గురించైనా మాట్లాడు’’ అన్నాడు. అక్బర్ విసుగుగా.
అప్పటికి బీర్బల్ ఊరుకున్నాడు.
అసలు బీర్బల్ పొన్నగంటి కూర పదేపదే తినడానికి కారణం ఉంది. బీర్బల్ కంటి చూపు మందగిస్తే, కంటికి మంచిది అని బీర్బల్ కూతురు అతనికి ప్రతిరోజు పొన్నగంటి కూర వండిపెట్టడం మొదలుపెట్టింది. అలా ఒక మండలం పాటు (మండలం అంటే 40 రోజులు) తింటే కంటి చూపు మెరుగవుతుంది.
బీర్బల్ 40 రోజులుపాటు పొన్నగంటి కూర తిన్నాడు. అతని కంటి చూపు మెరుగైంది. కొన్నాళ్ళ తర్వాత పాదుషా చూపు మందగించండం మొదలు పెట్టింది. అక్బర్ ఎంతోమంది వైద్యులతో వైద్యం చేయించుకున్నా చూపు మసక బారుతుంటే అక్బర్ కి దిగులేసింది.
అప్పడు బీర్బల్ అక్బర్ ని కలిసి ‘ ప్రభూ, పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి శాస్త్రం ప్రకారంంగా వైద్యం చేసే వైద్యుడు నాకు తెలసు, ఆయనకి మీ కంటి సమస్య గురించి చెప్పాను. ఆ వైద్యుడు మీకో మంచి మందుని ఇస్తానన్నాడు. దాన్ని మండలం రోజులపాటు జామకాయంత పరిమాణంలో ముద్ద చేసుకుని రొట్టెలతో కలిపి తినాలి!’’ అని చెప్పాడు.
అక్బరు సంతోషంతో అందుకుు అంగీకరించారు. బీర్బల్ అక్బరు పాదుషాకి రోజూ పొన్నగంటి కూరని ముద్దగా నూరి జామకాయ పరిమాణంలో చేసి ఇచ్చేవాడు. పొన్నగంటి కూర అంటే అక్బర్ ఒప్పుకోడని, చిరాకు పడ్తాడనీ బీర్బల్ అలా అబద్దం చెప్పాడు.
అక్బర్ అలా ఒక 40 రోజుల పాటు పొన్నగంటి కూర ముద్దని రొట్టెలతో కలిపి తిన్నాడు. అతని కంటి చూపు మామూలుగా అయిపోయింది. దాంతో అక్బర్ చాలా సంతోషించి ‘బీర్బల్, నా కంటి చూపును బాగుచేసిన ఆ వైద్యుడిని నాదగ్గరికి తీసుకురా, అతన్ని ఘనంగా సత్కరించాలి!’’ అన్నాడు.
బీర్బల్ నవ్వి జరిగిన విషయమంతా అక్బర్ కి చెప్పి నా చూపు మందగిస్తే మా అమ్మాయి నాకు పొన్నగంటి కూర వండి పెట్టి నా కళ్ళను నయం చేసింది. అదే వైద్యాన్ని నేను మీకు చేశాను. అని అన్నాడు.
బీర్బల్ తనకి అబద్దం చెప్పినందుకు అక్బర్ కి కోపం రాలేదు. పైగా తన కళ్లని బాగుచేసినందుకు చాలా సంతోషించి అతనికి విలువైన బహుమతులు ఇచ్చాడు.
అంతేకాు ఆనాటి నుండి అక్బర్ కూడా అప్పడప్పడూ పొన్నగంటి కూరతినడం మొదలుపెట్టాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: