భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతుజూచి కాలుడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!
భావము :
ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది.
పోయేటప్పుడు తన వెంట చిల్లికాసు కూడా వెంటరాదని తెలిసి కూడా దాన గుణంలేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది.
ఎప్పటికైనా ఏదో రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్దం అంటే భయపడి పారిపోయే వానిని చూసి మృత్యువు నవ్వుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: