మానవ సేవ కోసమే కొందరు పుడుతాల్లొ ఒకరు. లక్షల్లో ఒకరుగా కూడా కాదు, కోట్లాది మానవులలో ఒకరుగా అన్నార్తులనూ ఆపన్నులనూ ఆదుకోవడం కొందరికి సాధ్యపడితే యుద్దభూమిలో క్షతగాత్రును ఆదుకోవడానికీ, వారి గాయాలు కడిగి కట్లు కట్టి, చలికీ చాకిరికీ వెరవకుండా వాళ్లను అక్కున చేర్సుకునే వాళ్లు ఎంతమంది ఉంటారు.?
ఒక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ తప్ప ! మానవతా విలెవల మూర్తి ఆమె ! కఠోరదీక్షగా క్షతగాత్రులను తిరిగి ఆరోగ్యవంతులుగా చెయ్యడానికి, వైద్యసేవల ప్రమాణాలు పెంచడానికి వైద్యసేవికలలో అకుంఠిత సేవాభావం పాదుకొల్పడానికీ ఆమె తన జీవితం అంకితం చేసింది.
తన ఆరోగ్యం, తన సుఖం ఎంత మాత్రం లెక్కచెయ్యకుండా ఆశయసాధనకి అర్పితమైపోయిన నైటింగేల్ ప్రపంచ వైద్యరంగంలో ధృవతార! సేవభావంతో ఆమె ఎదిగిన ఎత్తులు లేవు, ఎవ్వరికీ మిగల్చనూ లేదు, తన అంకిత స్వభావంతో బాధాసర్పద్రష్టలకు సేవచేస్తూ దాతలనుండి వారికోసం వచ్చే విరాళాలు ఆమె ఎన్నడూ తనకోసం ఖర్చు పెట్టుకోనూ లేదు.
ప్రభుత్వాలు సైతం తమ సైనికులను నిర్లక్ష్యం చేసిన వేళల్లో ఆమె సైనికులను అనేక విధాలుగా ఆదుకుంది. కంటిమీది కునుకూ, కడుపులో ఆహారం సైతం మర్చిపోయి యుద్దభూమిలో శిబిరాలు తిరుగుతూ తన చేతి లాంతరుతో ఆర్తులను గుర్తించి సేవలందించారు. ఫ్లోరెన్స్ నైటెంగేల్. ఆమె తల్లి ఫానీ, తండ్రి విలియం, తమ తలితండ్రులకు రెండో సంతానంగా పుట్టింది దీపపు యువతి.
అక్క పేరు పార్తెనోప్, స్వస్థలం నేపుల్స్ నగరం. గౌరవర్యాదలు కలిగిన కుటుంబం వారిది. పుట్టీ పుట్టగానే ఫ్లోరెన్స్ ను క్రైస్తవమతంలో చేర్చింది తల్లి. పదేహేడేళ్ల ప్రాయంలోనే ప్లోరెన్స్కి ఆథ్యాత్మిక జీవనం అలవడింది. దేవుడే తనతో మాట్లాడుతూన్న అనుభూతికి లోనయ్యేది. ప్రతి విషయం ఒప్పగించినట్లు నమ్మి జీవితాంతం అదే కార్యక్రమానికి మనసావాచా కర్మణా అంకితమైపోయిన ధన్యజీవి ఆమె మానవసేవికలాగా తనను తాను గుర్తించుకుని దైవసేవలో తరించిందామె.
తల్లి తండ్రికీ ఆమె అంతరంగం తెలిసేదికాదు. రోగుల సేవకి అంకితం కావాలనుకుంది ఫ్లోరెన్స్. దైహిక వాంఛ వివాహ ప్రసక్తి ఆమె దరిదాపులకు వచ్చేవి కావు. వైద్య గ్రంథాలు విశేషంగా చదువుకునేదామె. వైద్యసేవికగ ప్రముఖ సంస్థల్లో శిక్షణ పొందింది ఫ్లోరెన్స్. రోమ్ నగరంలో అపార విజ్ఞానం సంపాదించిందామె. ఫ్లోరెన్స్ సున్నిత మనస్కురాలు. వైద్య సేవలందించడంలో మాత్రం ఘటికురాలు రోగం పట్ల అవగాహనా పెంచుకుని రోగిని బతికించడమే ఆమె లక్ష్యం, రోగినే కాదు ఆమె బాగు చెయ్యడం, రోగి పరిసరాలూ, రోగిని బతికించడమే ఆమె లక్ష్యం.
రోగినే కాదు ఆమె బాగుచేయడం, రోగి పరిసరాలూ, రోగికి వేళకు తగిన భోజనం అందించడం, రోగికి సాంత్వన వచనాలతో మానసిక ధైర్యం కూడా కలిగించడం ఆమె తన కర్తవ్యాలుగా భావించింది. ఒంటరి జీవితంలో రోగుల సేవలో తన జీవిత పరమార్థం ఎంచుకున్న ఫ్లోరెన్స్ ను ఆమె కుటుంబ సభ్యులు నిర్లక్ష్య్ చేశారు. తన హృదయం విప్పి వాళ్ల ముందుంచినా సరే వాళ్లు ఆమెకు తగిన రీతిలో సహాయపడలేదు.
చివరికి తమ ఆశీస్సులు కూడా ఆమెకు అందించలేదు ఆమెను ఇంటికి తిరిగి వచ్చాక కూడా గౌరవప్రదంగా చూడలేదు. ఆమె వేరే స్థావరం చూసుకునేవరకూ ప్రాణాలు తోడేశారు. ఇవన్నీ యిలా వుండగా రోగులకు వెచ్చటి ఆహారం అందేలాగా చర్యలు తీసుకోవడం నేర్పింది ఫ్లోరెన్స్ ! ప్రతి రోగికీ అందుబాటులో గంట ఏర్పాటు చేయ్యాలని ప్రయత్నించింది. రోగి అవసరాలు ఎప్పటికప్పుడు వైద్యం అందించేవారికి తెలియాలి అదీ ఆమె ఉద్దేశ్యం. రోగులకు ఫ్లోరెన్స్ ఒక వరదేవత.
ఇంతలో రష్యామీద యుద్దానికి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు సమయాత్తమై క్రిమియా యుద్ధభూమిలో తన సేనలతో ఢీ కొన్నాయి. అటూయిటూ భారీ ఎత్తున జననష్టం సంభవించింది. వేలమంది సైనికులూ, పౌరులూ, క్షతగాత్రులయ్యారు.. వారికి సేవలందించే అవకాశం ఫ్లోరెన్స్కి దక్కింది. నలబైమంది నర్సుల బృందానికి ఆమె పర్యవేక్షకురాలిగా అంతకు ముందెన్నడూ అంత గౌరవపదవి లభించలేదు.
అప్పటికీ గానీ తన కుటుంబసభ్యుల మన్నన పొందలేకపోయింది. ఫ్లోరెన్స్, 1854 అక్టోబర్ 21 నాడు ఆమె పారీస్ వెళ్తుండగా మధ్యలో బలగోన్ నగరంలో ఆమెకు పౌరసన్మాణం జరిగింది. అదే సమయంలో ఫ్లోరెన్స్ నిస్వార్థ సేవా పరాయణత్వం ఆమె సమాకాలికులైన వైద్యుల్లో అసూయద్వేషాలు రగిల్చింది. ఆమెకు అత్యున్నత సేవా పతకాలు లభించినప్పుడల్లా వాళ్లు ఆవేశకావేషాలతో వూగిపోయేవారు.
అయినప్పటికీ ఎవరెన్నీరకాలుగా ఫ్లోరెన్స్ అభివృద్ధికి మోకాళ్లు అడ్డం పెట్టాలనుకున్నా సరే ఆమె అప్రతిహతంగా తన ఆశయసాధనలో సాగిపోతూనే వచ్చింది. అదే సంవత్సరం నవంబర్ తొమ్మిదికల్లా యుద్ద వాతావరణం నానాటకీ క్షీణిస్తూ వచ్చింది. బ్రిటీష్ సైన్యం నిర్మూలించబడుతోంది. అనుకొని పరిస్థితిలో ఫ్లోరెన్స్ సేవలను మరింతగా ఆహ్వనించింది. ఆమెను వ్యతిరేకించిన వైద్యలే ఇప్పుడు ఆమె వైపు ఆశావహంగా చూడటం మొదలు
పెట్టారు.
వైద్యసేవలు అందించాలంటే వైద్య సేవికల సహాయ సహాకారాలు తప్పనిసరిగా అవసరం. సామూహిక శక్తిని ఆహ్వానించాలంటే అందుకే తగిన ఏకైక సమర్థవ్యక్తి ఫ్లోరెన్స్ మాత్రమే! సహాయ కార్యక్రమాల నిధి కూడా ఆమె ఆధిపత్యంలోనే. విచక్షణాధికారానికే లోబడే ఉండేది. ఆ సొమ్ము తక్కువ మొత్తంది కాదు. ముప్పయ్ వేల పౌనులు ఆమె వద్ద తప్పించి ప్రభుత్వాధికార్ల వద్దగానీ, సైన్యాధికారుల వద్దగానీ సైన్యం అవసరాల తీర్చగలిగే నిధులు లేవు. నిదులేకావు.. ఎర్రటి ఏగాణీ కూడా లేదు. ఆమె వితరణ శక్తికి మార్గం దొరికింది. ఎంతమందికి సహాయం అవసరం? వారికి ఏమే వస్తువులు అవసరం? వాస్తవంగా ఎవరికి అందించాలి? అనే విషయాలు ఆమె పరిగణలోకి తీసుకుంది.
తన ఆధ్వర్యంలో పని చేస్తోన్న సిబ్బందిని ఆమె వివరాల సేకరణకు ఉపయోగించుకునేది. వేడి నీటిని అందించడానికి తగిన సామాగ్రీ, ఆరువేల చొక్కాలూ, రెండు వేల జతల, మేజోళ్లూ, అయిదువందల జతల లోదుస్తులూ కొన్నదామె. వాటి సాయంతో సైనికులు శీతకాలపు వాతావరణం అధిగమించగలుతుతారు. ఇలా వుండగా మరో అయిదు వందల వ్యాదిగ్రస్తులు ఆస్పత్రిలో చేరారు. వారిలో క్షతగాత్రులు కూడా కలిసిపోయి వున్నారు. తలదాచుకునే స్థలం లేదు అస్పత్రిలో తగులబడిపోయి వున్న ఆస్పత్రి రెండోవైపు భాగాన్ని ఆమె రెండువందల మంది కార్మికులను నియోగించి బాగు చెయియంచి రోగులకు సౌకరవంతంగా తీర్చిదిద్దింది.
‘‘స్వర్గంలో ఉన్నాం మేము’’ అన్నారు. సైనికులు. ఒక ప్రభుత్వం మాత్రమే చెయ్యగలిగేటంత ఆపన్నహస్తం ఆమె ఒక్కతే అందించారు. నర్సులుగా పనిచేసే స్త్రీల ఔన్నత్యం ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఆమె తన జీవితకాలమంతా నిరూపించారు. కానీ ఆమె తన సహాయకుల నుంచి తాను ఆశించినంత మేరకు సహాయసహాకారాలు పొందలేక పోయారు. ‘‘ఆమె తిండి తనదు. నిద్రపోదు.
పని ఉంటేచాలు. అది కూడా బాధాసర్సద్రష్టులకు వైద్య సేవలు అందించడమే’’ అనే వారు వైద్యులు ‘‘ ఆమె చల్లని నీడ ఆ శిరస్సులు ముద్దాడితే చాలు రోగం మటుమాయమైపోతుంది.’’ అన్నారు. రోగులు. విక్టోరియా మహారాణి ఆమె సేవా దృక్పధం పట్ల ప్రశంసల జల్లుకురిపించి సహాయ నిధి అందించింది. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రిలో చివరి రోగి వెళ్లిపోయాక గానీ ఆమె వేరే సేవా కార్యక్రమం తలపెట్టేది కాదు నిరంతర సేవా కార్యక్రమంలో మీదపడుతున్న వయస్సుతో ఆమె అనారోగ్యానికి లొంగిపోయింది. 1901వ సంవత్సరంలో కంటి చూపు పోయింది.
1907 అత్యుత్తమ సేవా పతకం ప్రధానం చేశాడు. ఏడో ఎడ్వర్డ్ చక్రవర్తి 1910లో ఆగస్టు 13నాడు త్యాగమయి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆఖరి శ్వాస పీల్చి ప్రపంచానికి ఒక మహత్తర సందేశంగా నేటికి ఎంతోమందిలో సేవా స్పూర్తి రగిలిస్తోంది. కారణజన్మురాలామె.
మరింత సమాచారం తెలుసుకోండి: