కనకపు సింహాసనమున
శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
ఓ సుమతీ ! ఓ మంచిబుద్ది గలవాడా! కుక్కది హీనగుణము, దానిని మంచి ముహుర్తమునాడు బంగారపు సింహాసనమున కూర్చండ బెట్టినను హీనబుద్ధి విడవదు. అట్లే హీనుని ఉన్నత స్థానమున కూర్చండబెట్టినను అతని బుద్ధి మారదు .
మరింత సమాచారం తెలుసుకోండి: