తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృచ్ఛికమునకున్
దలతోక యనక యుండును ఖలునకు
నిలువెల్ల విషము గదరా సమతీ!
ఓ సుమతీ! పామునకు తలయందు విషము ఉండును, తేలుకు విషము తోకలో వుండును. కానీ, దుర్మార్గుడైన మనిషికి తల, తోక యనక శరీరమంతయు విషము ఉండును.
మరింత సమాచారం తెలుసుకోండి: