ఒక్కరు మాంసమిచ్చె మఱియెక్కడు చర్మము గోసి యిచ్చెనే వే
ఱొక్కరు డస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్క నిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తీ కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా!
ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు. ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరోకరు వెన్నెముక ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీల్లంతా బతుకలేక ఈ పనులు చేశారా? కీర్తి కోసం చేశారా? ఓ మంత్రి కులంలో జన్మించిన రాయన భాస్కరుడా?
భాగా ఆలోచించి చూడు.
( ఒక పావురాన్ని కాపాడడం కోసం శరీరం నుండి మాంసాన్ని కోసి ఇచ్చినవారు శిబిచక్రవర్తి ఇంద్రుడడిగితే సహజ సిద్దమైన కవచ కుండాలను కోసి ఇచ్చినవాడు కర్ణుడు. రాక్షస సంహారానికి ఇంద్రునకు ఆయుధంగా తన వెన్నెము కును ఇచ్చినవాడు దధీచి, వామనుడడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి వీళ్లంతా త్యాగధనులు, హహాదాతలు)
మరింత సమాచారం తెలుసుకోండి: