వరి పంటలేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ !
వరి పంటలేని ఊరును, ప్రభువులేని ఊరును సహాయము దొరకని మార్గమును, భర్తలేని ఇల్లును, ఆలోచింపగా శ్మశాన మువలే ఉండును. గాన పంటలు, ప్రభువు, భర్త ఉండాలని నీతి.
మరింత సమాచారం తెలుసుకోండి: