కొఱగాని కొడుకు పుట్టిన
కొఱగామియే కాదు తండ్రి గుణముల జెఱచున్
జెఱకు తుద వెన్ను పుట్టిన
జెఱకున దీపిల్ల జెఱచు సిద్దము సమతీ !
చెరుకుగెడ చివర వెన్నుపుట్టినచో యా చెఱకుగెడ యందలి తీపినంతయును ఎట్లు చెరచునో అట్లే అప్రయోజకుడగు కుమా రుడు పుట్టిన ఆ వంశమునుకు ఉపకారి కాకపోయిననూ సరి గదా ! తన తండ్రి మంచి గుణములను చెరచును చెడ్డకీర్తి తెచ్చునన్నమాట.
మరింత సమాచారం తెలుసుకోండి: