కమలములు నీట బాసిన
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పన
దమ మిత్రులు శత్రువులౌట తథ్యము సమతీ!
కలమలమునకు నివాసము నీరు. ఆ కమలములు తమ నివాస మైన నీటిని విడిచి పెట్టిన తరవాత మిత్రుడగు సూర్యుని వేడిచే కమలిపోవును, అట్లే మానువులు తమ తమ నివాసములను విడిచిపెట్టిననచో, తమ స్నేహితులే విరోధులుగా మారి బాధించును ఇది నిజమని గ్రహించాలి
మరింత సమాచారం తెలుసుకోండి: