ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడి పేరు రామరాజు అతడి భార్య పేరు రాజమ్మ, రామరాజుకు పెద్ద ఇల్లుంది. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది. అతడింట్లో చాలామంది కూలీలు పనిచేస్తూండేవారు. ఒక రోజు ఒకతను వచ్చి తాను అనాధనని, నా అన్నవారు ఎవరు లేరని, తనకేదైనా పని ఇప్పించండని తనకి జీతమివ్వకపోయిన పర్వాలేదు. అన్నంపెడితే చాలని రామరాజు, రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు.
వారిద్దరూ దయతలచి పనిలో పెట్టుకుననారు. అతడు రామరాజు వద్ద తన పేరు. ’చెట్టు’ అని. రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు. ఓ రోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ, చూసింది. ఆమె పరుగు పరుగున వెళ్లి భయంగా తన భర్తతో ఏవండి! నీరు డబ్బు దొంగిలిస్తున్నాడండి అని చెప్పింది. అప్పుడు రామరాజు నీకేమైనా పిచ్చా!
నీరు డబ్బు దొంగిలించడమేమిటి? నీరుకి చేతులున్నాయా ? కాళ్లూన్నాయా? నీకంతా పిచ్చికాకపోతే’’ అని బయటకు నడిచాడు. అప్పడు రాజమ్మ అదేనండి మనింట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలించి పారిపోతున్నాడి. వాడ్ని పట్టుకోండి అని అన్నది. అప్పడు రామరాజు తెల్లబోయి ఓరే రంగా, బీముడు, అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు.
అప్పడా కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టున్నారు. అప్పుడు రామరాజు కూలీలను ఆ చెట్టును కాదురా ! డబ్బు దొంగలించుకుపోతున్న వ్యక్తిని పట్టకోండిలా అనే లోపల ఆ దొంగ తప్పించు పారిపోయాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: