ఆశ పాపజాతి యన్నంటికంటెను,
ఆశ చేత యతులు మోసపోరే,
చూచి విచడువారె శుద్ధాత్ములెందైన,
విశ్వదాభిరామ వినురవేమ
భావం
ఏదైనా ఒకదాన్ని ఆశపడడంలో తప్పులేదు. మితిమీరిన ఆశ ప్రమాదకరం. అది ఎంతటి వారిని అయినా దిగజారుస్తుంది. అన్నింటినీ త్యజించిన మునులే ఆశ వలన అథోగతి పాలయ్యారు. మానసిక ప్రశాంతత కోరుకునే వారు ఆశ విడనాడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: