పద్యం  వెయ్యారు నదులు జలనిధి,  తియ్యక ననిశంబు గలయ తియ్యన గలదా,  కుయ్యిడు వానికి జానము,  వెయ్యి విధంబులను దెలుప వృథరా సుమతీ  భావం  వేల నదులు వచ్చి సముద్రంలో కలువవచ్చు. అయినా సముద్రపు నీటికి మాత్రం తియ్యదనం రాదు. అలాగే నీచుడికి వేయి బోధలు చేసినా అతనికి తెలివి రాదు. పైగా సముద్రంలో కలిసిన నది నీరు ఉప్పగా మారినట్టు, చేసిన బోధలను కూడా నీచుడు తన నీచపు పనులకే వాడుకుంటాడు. అందుకే, నీచుడిని ఉత్తముడిగా మార్చే ప్రయత్నాలు చేయకూడదు. అవన్న పూర్తిగా వృధా అయి పోతాయన్న పాఠాన్ని ఈ పద్యం చెబుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: