కాశీపురంలోని వేదశాస్త్ర్రీ వేదపండితుడు అతడి ఏకైక పుత్రరత్నం పరమ శుంఠలా తయారై ఇల్లు విడిచి దేశాలు పట్టిపోయాడు. శాస్త్రీ భార్య విశాలక్ష్మి మహాసాధ్వీ చేతికొచ్చిన కొడుకు చేజారి పోయాడనే దిగులుతో మంచం పట్టింది. కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి ఆమెకు కళ్లు కూడా కన్పించకుండా పోయాయి.  గర్భ దరిధ్రుడైన వేద శాస్త్రీకి కష్టాలు కొత్తవికాకపోయినా ఎక్కువైనాయి బ్రహ్మముహుర్తంలో లేచింది. మొదలు దైవకార్యాలు చేయడం, ఆ పూటకు భిక్ష సంపాదించుకోవడం. వంట చేసి భార్యకు తిప్పించడం, ఆమెకి సేవచేయడం అతడి దినచర్య అయిపోయింది. మంచంలోనే కృషించి, కృషించి ఆమె ఓ రోజు తనువు చాలించింది. తనకున్న ఆ ఒక్క పూరిల్లు అమ్మి ఆడబ్బుతో వేదశాస్త్రీగారు మరణించిన తన భార్యకి సాంప్రాదాయంగా కర్మ క్రతువులు నిర్వహించాడు. కన్న కొడుకును, కట్టున్న బార్యను, చివరికి తనకంటూ ఉన్న పూరి గుడెసెను కూడా పోగొ్ట్టుకొని నిర్మల చిత్తంతో, సుఖదు:ఖలకు అతీతంగా వున్న అతడ్పీ చూసి కార్యానికొచ్చిన కొందరు ఆ విషయమే అతడితో ఇలా అన్నారు. శాస్త్రీ ! అనేక జాతి పక్షులు ఓ మహావృక్షాన్ని ఆశ్రయించి, విశ్రమించి, సూర్యోదయంతో పలు దిక్కులకు వెళ్లిపోతుంటాయి. మానవ జీవితమూ అంతే ! ఆ భూమ్మీద మన పని అయిపోగానే వెళ్లిపోతుంటాం. అశాశ్వతమైన ఇహలోక బాంధవ్యాల కోసం బాధపడుట మెందుకురా? అని దాంతో జ్ఞానోదయమైన శాస్త్రీ మనసులో పవచైతన్య కిరణాలు ప్రసరించి ఇహలోక మోహాలకు స్వస్తిచెప్పి దైవ సాన్నిధ్యంలో గడిపే నిమిత్తం హిమాలయాలకు పయనమయ్యాడు.  అశాశ్వతమని తెలిసీ  కూడా ఇహలోక బాంధవ్యాలపై మక్కువ ఏర్పరచుకోవడం అవివేకం.

మరింత సమాచారం తెలుసుకోండి: