అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని,
ఘనుడు గాడు హీనజనుడె గాని,
పరిమళముల మోయు గాడిద,గజమౌనా?
విశ్వదాభిరామ వినుర వేమ
భావం
ఎన్ని చదువులు చదివినా, మనసు నిండా చెడు ఆలోచనలు పాతుకుపోయిన వ్యక్తిలో మార్పురాదు.ఎన్నాళ్ళు చదివినా అతను హీనుడి గానే ఉండి పోతాడు తప్ప గొప్పవాడు కాలేడు. గంధపు చెక్కలను వీపు మీద మోసినంత మాత్రాన గాడిద ఏనుగు అయిపోదు కదా.
మరింత సమాచారం తెలుసుకోండి: