ఒకప్పుడు పిల్లల పేర్లు పెట్టాలంటే మన పెద్దవారి జ్ఞాపకార్ధం వారి పేర్లు పెట్టుకునేవారు. కానీ నేటి యువత అలా పెట్టడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. అందులోనూ సెలబ్రెటీలయితే కొత్తగా వెరైటీగా పెట్టుకోవాలని చూస్తారు. ఇక ఈ రోజుల్లో పిల్లలకు పేర్లు పెట్టడం అనేది అమ్మానాన్నకు ఒక సవాలే..ఒకప్పుడు . కొంతమంది వారికి నచ్చిన వారి పేర్లు పెట్టేవారు..కానీ ఇప్పుడు పిల్లల పేర్లు చాలా విభిన్నంగా పెట్టడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు..తమ పిల్లలు పేర్లు కొత్తగా ఉండేలానే కాదు.. చెప్పగానే ఇతరులను ఆకట్టుకునేలా ఉండాలని ఎంతో స్టైలిష్ నేమ్స్ కోసం వెంపర్లాడుతున్నారు. పేరు పెట్టడం అనగానే జాతకం చూపించి, వారి జాతకం ప్రకారం వచ్చిన అక్షరం కాకుండా వారి వారి పేర్లలోనే కొన్ని అక్షరాలను కలుపుకుని పిల్లలకు పేర్లు పెడుతున్న వాళ్లు కూడా ఉన్నారు.. అలాంటి పేర్లలో కొంతమంది సెలబ్రిటీల పిల్లల పేర్లు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇటీవలే పుట్టిన పవన్ కళ్యాణ్ చిన్నకొడుక్కి Mark shankar Pawanovich అనే పేరు పెట్టారు. ఈ పేరుని గమనిస్తే మార్క్ అంటే క్రిస్టియన్స్ దృష్టిలో మార్స్ దైవం అని. శంకర్ అనేది మెగా స్టార్ గారి అసలు పేరులో నుండి తీసుకుంది. ఇక పవన్ అనే పేరు “పవన్ కళ్యాణ్” నుండి తీసుకుంది.
అలాగే పవన్ రెండో కూతురి పేరు Polina Anjana Pawanovna . అందులో పోలిన అంటే గ్రీక్ దైవం, అంజనా అనేది పవన్ కళ్యాణ్ తల్లి పేరు ఇక పవనోవనా అంటే అందులో పవన్ పేరు కలిసేలా పెట్టుకున్నారు.
భల్లాలదేవుడిగా ఆకట్టుకున్న రానా విషయానికి వస్తే రానా పేరు వారి తాతగారి నుండి వచ్చింది. మూవి మొఘల్ రామానాయుడు పేరులోని రెండక్షరాలను తీసుకుని రానా అనే పేరు పెట్టారు. స్టైలిష్ స్టార్ అర్జున్ వాళ్ల పాపకి కూడా అర్జున్ మరియు ఆయన సతీమణి స్నేహల పేర్లు కలుపుకుని ఉంటుంది..అర్హ. ఇక అక్కినేని ఫ్యామిలి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చైతన్య పేరు లో కూడా తాత, నాన్న లపేర్లు కలుపుకుని ఉంటుంది. నాగ చైతన్య, నాగార్జున, నాగేశ్వర్‌రావ్ ఈ మూడింటిలో కూడా నాగా అన్నది కామన్..
వివాహ్, జబ్ వియ్ మెట్ సినిమాలతో తెలుగు అమ్మాయిల మనసు దోచుకున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆయన తన కూతురు పేరు కూడా వెరైటిగా పెట్టారు. ,షాహిద్ వైఫ్ నేమ్ లోని మీరా లో మీ, షాహిద్ లోని షా ..రెండు కలిపితే మిషా. అని ఆ పేరు పెట్టుకున్నారు. ఇక ఐష్‌వర్యరాయ్ కూతురు పేరు కూడా అమితాబ్ మనమరాలిగా కూడా ఆరాధ్య చాలా ఫేమస్..ఆరాధ్య నేమ్ లో నాన్న అభిషేక్ లోనుండి మొదటి లెటర్,ఐశ్వర్యలోనుండి చివరి లెటర్స్ తీసుకుని ఆరాధ్య పేరు పెట్టారు.