ఇండ‌స్ట్రీలో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు హీరోల వార‌స‌త్వం రావ‌డం అనేది స‌ర్వ సాధార‌ణం. మ‌రి అలాంటి ప్ర‌జంట్ జ‌న‌రేష‌న్ హీరోలు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు అఖిరానంద‌న్‌, అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు కొడుకు గౌత‌మ్ నంద‌న్ నెక్స్‌ట్ జ‌న‌రేష‌న్ హీరోల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య కొన్ని ఆశ‌క్తి క‌ర‌మైన పోలిక‌లున్నాయి. వారి ఫ్యామిలీల నేప‌ధ్యం త‌ల్లిదండ్రుల బ్యాక్‌గ్రౌండ్ ప్రేమ‌, పెళ్ళి ఫ‌స్ట్ మూవీ ఇలా అనేక అంశాలు కోఇన్‌సిడెంట్‌గా జ‌రిగినివే అయినా గౌత‌మ్ అఖిరా గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు ఇవ‌న్నీ చాలా ఆశ‌క్తిక‌ర‌మైన అంశాలుగా క‌నిపిస్తాయి. వారి సినీ కెరియ‌ర్‌ను బ‌ల‌మైన పునాదులు వేసే ఆ పోలిక‌లు ఏంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సులుగా వ‌స్తున్న ఎంట్రీలు త‌రాలుగా చూస్తున్న‌దే. అయితే అలా వార‌సులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంద‌రు సూప‌ర్ స‌క్సెస్ ఇస్తూ ముందు త‌రాల పేరు నిల‌బెడుతున్నారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ వార‌సుడిగా వ‌చ్చిన మ‌హేష్‌బాబు తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినీ వార‌సుడిగా రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ వ‌చ్చి సూప‌ర్‌హిట్స్ కొట్టారు. అయితే రామ్‌చ‌ర‌ణ్ కంటే ముందే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చిరంజీవి వార‌సులుగా ప‌రిచ‌యం అయ్యారు. వ‌రుస హిట్ల‌తో త‌న స్టామినా చాటాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. ఇప్పుడు ఘ‌ట్ట‌మ‌నేని హీరోగా గౌత‌మ్‌నంద మ‌హేష్‌బాబు కొడుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే సిల్వ‌ర్ స్క్రీన్ పై బాల‌న‌టుడుగా ఎంట్రీ ఇచ్చేశాడు. ప‌వ‌న్ కొడుకు అఖిరానంద‌న్ కూడా ఆరేళ్ళ వ‌య‌సులో మ‌రాఠి సినిమాలో న‌టించారు. భ‌విష్య‌త్తులో కొణిదెల వంశ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయం. 

 

ఈ నేప‌ధ్యంలో మ‌హేష్‌బాబు కొడుకు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొడుకు హీరోలు కాబోతున్నారు. ముఖ్యంగా గౌత‌మ్ విష‌యానికి వ‌స్తే...ప్ర‌స్తుతం గౌత‌మ్ టీనేజ్‌లో ఉన్నాడు. మొన్న ఆగ‌స్ట్ 31న త‌న ప‌ద‌మూడ‌వ పుట్టిన‌రోజును చేసుకున్నాడు. గౌత‌మ్‌కి ఇటు త‌ర‌పునుంచి అటు త‌ల్లి త‌ర‌పు నుంచి బ‌ల‌మైన సినీ నేప‌ధ్యం ఉంద‌నే చెప్పాలి. న‌మ్ర‌త కూడా త‌న సినీ కెరియ‌ర్‌ను ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించింది. త‌ల్లిదండ్రులిద్ద‌రూ యాక్టింగ్ కుటుంబాల నుంచి వ‌చ్చిన వారే. మ‌రో ఐదేళ్ళ‌లో గౌత‌మ్ ల‌వ‌ర్‌బాయ్‌గా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అఖిరా కూడా ప్ర‌స్తుతం టీనేజ్‌లోనే ఉన్నాడు. 2020 ఏప్రిల్ 7 త‌న 17వ పుట్టిన రోజ‌జును చేసుకోబోతున్నాడు. వంశీ టైంలో వారిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిన‌ట్లే... బ‌ద్రీ టైంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. అఖారాకి కూడా ఫుల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ట్లే. మ‌రో మూడు, నాలుగేళ్ళ‌లో ల‌వ‌ర్‌బాయ్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. a

మరింత సమాచారం తెలుసుకోండి: