వేలెడంత లేవు నీకెందుకురా ఈ పెద్ద పెద్ద ఆటలు అని కొంత మంది ఇళ్ళల్లో తల్లిదండ్రులు తిడుతుంటారు. నిజానికి ఆటతో వయసుతో పనేముంటుంది. కొంత మంది పిల్లలు చాలా చక్కగా వారి టాలెంట్‌ని చూపిస్తుంటారు. వారి వయసుతో సంబంధం లేకుండా వీళ్ళ సైజ్ తక్కువైనా వయసు చిన్నదైనా ప్రొఫెషనల్స్‌కి ఏమాత్రం తీసిపోరు. ఒకొక్కళ్ళు క్రికెట్‌లో ఇరగదీస్తుంటే... మరొకరు బాస్కెట్‌బాల్‌తో అద్భుతాలు చేస్తారు. ఒకరు స్నూకర్ టేబుల్ మీద సంచలనాలు సృష్టిస్తుంటే... మరొకరు జిమ్నాస్టిక్స్‌లో శరీరాన్ని విల్లులా వంచుతారు. మరి ఆ చిచ్చరపిడుగుల టాలెంట్‌ని తల్లిదండ్రులు గుర్తించి గేమ్స్‌లో సరైన శిక్షణ ఇప్పిస్తే చాలా బావుంటుంది. అంతే తప్పించి వాళ్ళ టాలెంట్‌ని గుర్తించకపోతే ఎప్పటికీ అలానే పిల్లలు సఫర్ అవుతారు.
మరికొంత మంది ఇళ్ళల్లో తల్లిదండ్రులు వారి టాలెంట్‌ని గుర్తించి శిక్షణ ఇస్తుంటారు. అలాంటి పిల్లలు మెరుగుగా ముందుకు దూసుకుపోతుంటారు. మరి ఉదాహరణకి సరిగ్గా మాటలు కూడా రాని ఓ సిసింద్రీ బాస్కెట్‌బాల్ పై మనసుపారేసుకుని సరిగ్గా గురి చూసి బాల్‌ని వేసేవాడు. అతని ఇంట్రస్ట్ తెలుసుకున్న తండ్రి తనకి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు. అంతే ఒక్కబాల్‌తో ఆడే ఆ బుడ్డోడు ఇప్పుడు ఏకంగా రెండు బాల్స్‌ని ఒకేసారి బాస్కెట్‌లో వేయడం నేర్చుకున్నాడు. మరి కొంత మంది పిల్లలకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టముంటది. టీవీలో మ్యూజిక్ వస్తే చాలు ఊగిపోతుంటారు. మరి అలాంటప్పుడు డాన్స్ కాదు ముందు చదువు..చదువు ఇంపార్టెంట్ అంటుంటారు. కానీ చదువుతోపాటు అన్ని యాక్టివిటీస్‌ని పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వారి టాలెంట్ ఎందులో ఉంది. ఏది బాగా చెయ్యగలగుతాడు అన్నది ఒక క్లారిటీ వస్తుంది.
ఇలా ఒక్కో పిల్లాడు ఒక్కో విషయంలో వారి వారి టాలెంట్‌ని బయటపెడుతుంటారు. మరి కొంత మంది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద ఇంట్రస్ట్ పెడుతుంటారు. ఎప్పుడు చూసిన పేపర్లతో ఏవో తయారు చేయడం లాంటివి చేస్తుంటారు. అవి ఇదేంటి ఇల్లంతా చెత్తచేస్తున్నావ్ అంటూ కొంత మంది తల్లిదండ్రులు తిడుతుంటారు. కానీ జాగ్రత్తగా భద్రపరిచి వాళ్ళను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే వారి టాలెంట్ బడటపడుతుంది. పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు వేరే అధర్ యాక్టివిటీస్ కూడా ఇపార్టెంటే. పిల్లలకు సమాజం పై అవగాహన ఉండటం లేదు. ఎంత సేపు చదువు ఒత్తిడితో పిల్లలు మానసికంగా కూడా ఇబ్బందిపడి. మతిస్థిమితం లేకుండా అయిపోతున్నారు.